విజయవాడ: చిట్టినగర్ లో గత వారం రోజులుగా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులకు, వివిధ సంస్థల వాలంటీర్లకు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, 46వ డివిజన్ ప్రత్యేక అధికారి రాజబాబు 46 వ డివిజన్లో రెయిన్ కోటులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
వర్షం, వరద నీరు, మురుగు వంటి ప్రతికూల వాతావరణంలో సైతం వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్న యువత వర్షంలో తడుస్తూ కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో వారి సేవలను అభినందించి వారికి రెయిన్ కోటులు, శానిటైజర్లు పంపిణీ చేశారు ప్రజల కోసం కష్టపడుతున్న యువతను మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.