రజత్ కుమార్ వ్యవహారంలో పిటిషనర్ గవినోళ్లకి ఢిల్లీ హైకోర్టు అక్షింతలు

ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నిబంధనలపై పూర్తి అవగాహనతో మళ్ళి కోర్టుకు రండి, అంతే తప్ప ఒకే ధోరణి గల ప్రశ్నను పట్టుకొని అసంపూర్తి వాదనలు వినిపించటం సరికాదని తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ వ్యవహారంలో ఢిల్లీ హై కోర్ట్ ను ఆశ్రయించిన పిటీషనర్ గవినోళ్ల శ్రీనివాస్ ను న్యాయమూర్తి హెచ్చరించారు.

ఈ కేస్ విషయంలో చట్టాలపై మరింత అవగాహన తెచ్చు కొని పూర్తి స్థాయిలో వాదనలు వినిపించేందుకు సన్నద్ధం కావాలని , పై పై వాదనలు వినిపించ వద్దని పిటిషినర్ కు ఢిల్లీ హైకోర్టు సూచించటం తో పాటు ఒకింత అసహనం వ్యక్తం చేసింది. ఈ కేస్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రాధమిక విచారణ ప్రారంభించింది అని తెలంగాణా ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది కోర్ట్ కు విన్నవించారు. తెలంగాణ ప్రభుత్వం వాదనలతో ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు, కేసు ను డిసెంబర్ నెలాఖరుకు వాయిదా వేసింది.