Suryaa.co.in

Political News

రాజుగారు సేఫ్!

రఘురామకృష్ణరాజుగారు!
రాజీనామా!?
అనర్హతా!?
ఏది ముందు!?
ఇది చాలా మంది మెదళ్ళను తొలుస్తున్న సమస్య!

అధికార పార్టీ యంపీ గా ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాల పై నిత్యం విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.
వారు మాట్లాడిన దాంతో ఏకీభవిస్తున్నారు జనం..!
అందుకే మద్దతు లభిస్తుంది…పార్టీల కు అతీతంగా..!

కరడు గట్టిన వైసీపి కార్యకర్తలు ఆయన మీద తిట్లతో విరుచుకు పడుతున్నారు.
కాని అంతకు ముందు జగన్ కు మద్దతిచ్చిన వారు అధిక శాతం రఘురాజు గారి పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారు.
సామాన్య ప్రజలైతే పూర్తిగా వారి గొంతుగా భావిస్తున్నారు.
ఇక రాజకీయ పార్టీలు ఒకటి రెండు తప్ప అందరూ ఆయనకు మద్దతు గానే నిలుస్తున్నారు.
ఈ విషయంలో బీజేపి వైకిరి మొదటి నుండి విభిన్నమే!
అనుమానస్పదమే.

రాజుగారి వెనుక బీజేపి ఉందని ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు..!
ఇదమిద్దంగా చెప్పలేకపోయినా వారి మద్దతు సుస్పష్టం..!
భద్రత విషయంలో ..ఆయన లేఖలకు స్పందించే దానిలో..కోరినంతనే సమయం కేటాయించటం..సమావేశం అవ్వటం..!
కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ఈయన తో సన్నిహితంగా మెలగటం ..! జరుగుతున్నది.
సంఘ్ పెద్దల ఆశీస్సులు ఈయనకు పుష్కలంగా ఉన్నాయి.
అఖిల భారత క్షత్రియ మహాసభ వీరి కి దన్నుగా నిలుస్తుంది.

మరో వైపు..!
బెయిలు రద్దు పిటీషన్..!
నిరంతరం వేపుడు ..!

రఘురాజుగారిని భరించలేని జగన్ అండ్ కో..!
అక్రమ అరెస్టు..పాశవిక దాడి కి తెగబడ్డారు..!
అంతం చెయ్యటానికి చూశారు..
రాజుగారు గాయపడినా..జనంలో సానుభూతి వెల్లువెత్తింది.
ఆ గండం నుండి బయటపడటానికి కేంద్ర పెద్దల సాయం లభించిందంటారు.

అయితే ఒక పార్లమెంట్ సభ్యుడ్ని ఈడ్చుకెళ్ళే సాహసం చెయ్యాలంటే..వారికి కూడా కేంద్ర పెద్దల అండ కావాలసిందే!
తెలంగాణా పెద్దల సహకారం లేకుండా చెయ్యలేరు.

పార్లమెంట్ సభ్యుడి మీద జరిగిన ఈ తరహా లాకప్ హింస..స్వాతంత్ర్యానంతరం ఇదే మొదటి సారి..!
లోక్ సభ స్పీకర్ కి పిర్యాదు అందినా..చర్యలు శూన్యం..!
అలాగే న్యాయస్ధానాల్లో దీనికి సంబంధించిన వాజ్యాలు పెండింగ్ లో ఉన్నాయి..ముందుకు కదలని పరిస్ధితి..!

ఇక్కడే అనుమానాలు వస్తున్నాయి !

ఇటీవల రాజుగారు రాజీనామా చేస్తారు..!
బీజేపి లో చేరతారు అన్న వార్తలు హల్ చల్ చేసాయి..!
ఆయన పూర్తిగా ఖండించ లేదు..!
రాజీనామా చేసి ఎన్నికల కెళ్ళటం మాత్రం ఖాయం అన్నారు.

బెయిలు రద్దు సహా..ఇతర కేసుల్లో న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు.
విమర్శల పదును పెంచారు..!
అనర్హత విషయంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురు కున్నారు.
ఇటీవల తెలంగాణా కు చెందిన బీజేపి యంపీ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ గారి విషయంలో సత్వరం స్పందించారు లోక్ సభ స్పీకర్..!
అలాగే మరో యంపీ అరవింద్ గారి ఇష్యూ లోనూ స్వయంగా స్పీకర్ గారు ఫోన్ చేసి మాట్లాడారు.

రాజుగారు..!
ఒక్క శాతం ఓటు లేని బీజేపి పక్షాన ఉప ఎన్నికలో నిలవటానికి సాహసం చేస్తున్నారు.
నిజంగా దుస్సాహసమే!
నిజానికి ఏ ముఖం పెట్టుకుని జనంలో కెళ్ళాలా అని చూసే బీజేపి కి ఇది సువర్ణావకాశం..!
బీజేపి మీదున్న ఆగ్రహాన్ని సగానికి సగం తగ్గించుకోవచ్చు.
రాజీనామా చేసిన కారణం వల్ల అనివార్యంగా టీడీపి సహా ఇతర పక్షాలు మద్దతు ఇచ్చేవి.

అసలు ముందుగా అడ్డగోలుగా..అక్రమ మార్గాల్లో దౌర్జన్యంగా ఎన్నికల్లో విజయాన్ని దక్కించుకుంటున్న అధికార వైసీపి ని ఓడించగలిగితే..!
అందరి లో స్ధబ్ధత వదులుతుంది.
జగన్ ఫోబియా నుండి బయటపడతారు.

ఇప్పుడు రఘురాజు గారికి సమస్య కాదు.
ఒక వేళ ప్రివిలేజ్ కమిటీ నోటీసు లందుకున్నా …ఆయనకు వ్యతిరేక నిర్ణయం వెలువడాలన్నా ..అది సుదీర్ఘకాలం పడుతుంది.

ఈలోగా పుణ్యకాలం గడుస్తుంది.
ఈయన రుబ్బుడు కొనసాగుతుంది.
వైసీపీ- బీజేపి అక్రమ సంబంధం ఇక ముందు రహస్యం కాదన్న సంగతి తెలుస్తుంది.
రాష్ట్రంలో ప్రధాన పక్షానికి కూడా స్పష్టత వస్తుంది.
దేశంలో ఇటీవల వ్యతిరేకత మూట కట్డుకున్న బీజేపి కి ..భయం వల్ల కాని..అండ కొరకు గాని కేంద్ర పెద్దల వైపు చూస్తున్న వారి మద్దతు కొరవడుతుంది.
జగన్ ప్రభుత్వ వ్యతిరేకత లో ఇప్పటికే సింహభాగం వారి ఖాతాలో పడింది.
ఈసారి పూర్తిగా జమ అవుతుంది.

rajnath-singh-rajuఎలా చూసినా బీజేపికి ధర్మసంకటమే!
రహస్య స్నేహమా!?
ప్రజల మద్దతా!?
అన్నది వారు తేల్చుకోవాల్సిన సమస్య!
క్రమం తప్పకుండా అందుకుంటున్న కప్పం వదులుకోవాలా వద్దా అన్నది వారి ముందుంటుంది.
ఇప్పటి వరకు రాజు గారి అడుగులు ఆయనకు ప్రతిష్ఠ పెంచే విధంగానే ఉన్నాయి.
బంతి ని ఆయన బీజేపి కోర్టులోకి నెట్టారు.
సహజంగా ఆట చూడటానికి ఇష్టపడే కేంద్ర పెద్దలు ఆడాల్సి రావటాన్ని ఇష్టపడరు.
అందుకే అస్పష్టత!
ఇది ఇలాగే కొనసాగుతుంది..!
రాజుగారు సేఫ్!

adusumilli-srinivasrao
– అడుసుమిల్లి శ్రీనివాసరావు

LEAVE A RESPONSE