Suryaa.co.in

Andhra Pradesh

రాజు గారూ.. సారీ అండి..

క్రూర రాజకీయం..ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాము..!
గత నాలుగు సంవత్సరాలు గా మడమతిప్పని పోరాటం చేశారు..!
రాజ్యహింసకు గురయ్యారు..!
చావు అంచులకు వెళ్ళి వచ్చారు..!

ప్రజల గొంతై నిలిచారు..!
పాలకుల క్రూరత్వం అవకతవక నిర్ణయాల మీద నిరంతరం తన స్వరాన్ని వినిపించారు..!
పార్టీలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రజల మనస్సు గెలిచారు..!

రాష్ట్రంలో పొత్తులు పొడవటానికి రాజు గారు తనవంతు ప్రయత్నాలు చేసారు.
కేంద్రపెద్దల సహకారం వారి నిష్పాక్షికత వల్ల అరాచకానికి అడ్డుకట్ట వెయ్యొచ్చన్న భావన ఆయన మాటల్లో వినబడేది.
వారు బీజేపి తరుపున పోటీ చెయ్యాలనుకున్నారు.
ఆమాటకొస్తే ఏ పార్టీ తరుపున పోటీ చేసినా వారికి విజయం తధ్యం..!
జనసేన టీడీపి తరుపున అయితే రికార్డు స్ధాయిలో ఆధిక్యత వస్తుంది.

ఇవాళ ఆయన మీద కుట్ర జరుగుతుంది..!
బూచాడు తన ప్రభావం చూపిస్తున్నాడు..!
బీజేపి కూటమి ఎవరితో ఉన్నా..కాపురం తనతోనే అనే సందేశం..సంకేతం విజయవంతంగా పంపించగలుగుతున్నాడు..!

ఇది కచ్చితంగా ప్రభావం చూపుతుంది..!
రాష్ట్ర ప్రజలు గాని టీడీపి శ్రేణులు గాని బీజేపి పట్ల ఆసక్తి లేదు.
నిష్పక్షపాత ఎన్నికలు..చట్టం తన పని తాను చేసుకుందేమో అన్న ఆశ వల్ల సరిపెట్టుకుంటున్నారు.

నరసాపురం కాని మరే ఇతర చోట కాని సిట్టింగు యంపీ..పోరాట యోధుడు రఘురామకృష్ణం రాజు గారికి స్ధానం లభించకపోతే..పొత్తు నిష్ఫలం అవుతుంది.
జగన్ అరాచకం నిర్విరామం గా కొనసాగుతుంది..!
టీడీపి శ్రేణుల ఆత్మస్ధైర్యం దెబ్బతింటుంది..!
వీళ్ళు ఇంకా వాడితోనే ఉన్నారన్న అనుమానాలు ఉన్నాయి ఇన్నాళ్ళూ..!
ఇప్పుడు నిర్ధారణ అవుతుంది..!

రఘురామరాజు గారి పోరాటం వృధా కాదని ఆశిద్దాం..!
శౌర్యము ఏనాటికి ఓడిపోదని భావిద్దాం..!

అంతిమంగా క్రూరరాజకీయాలకు..రంకు రాజకీయాలకు ప్రజలే ముగింపు పలకాలి..!

సారీ రాజుగారు..!

– అడుసుమిల్లి శ్రీనివాసరావు

LEAVE A RESPONSE