Suryaa.co.in

Andhra Pradesh

వందేళ్ల చరిత్ర ఉన్న సీపీఐని కించపరచడం మానుకో సజ్జల

-చేతనైతే డిబేట్ కు రా
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సవాల్

అనంతపురం అర్బన్: ఏప్రిల్ 1: వందేళ్ల చరిత్ర ఉన్న భారత కమ్యునిస్టు పార్టీని కించపరిచే యోగ్యత వైసిపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి లేదని చేతనైతే డిబేట్ కు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ సవాల్ విసిరారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పై వైసీపీ సలహాదారు సజ్జల చేసిన వ్యాఖ్యలను రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ టీడీపి కి వత్తాసు పలికినట్లుగా మాట్లాడాడని,సీపీఐ ని చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా అంటూ వైసీపీ ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి వక్రీకరించడం మానుకోవాలని హితవు పలికారు.

సీనియర్ నాయకుడు నారాయణ మాటలపై చేతనైతే సజ్జల విమర్శించుకోవాలి గాని పార్టీని వక్రీకరించి మాట్లాడటం మంచిది కాదన్నారు. వైసీపీ కి అధికారం వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా సీపీఐ చేస్తున్న విమర్శలకు మాజీ సీఎం చంద్రబాబును కూడగడుతున్నారన్నారు.2004 ఎన్నికల్లో వైఎస్ రాజ శేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు సీపీఐ సీపీఎం రెండూ కాంగ్రెస్ పార్టీతో కలసి జతకట్టాయని గుర్తు చేశారు.ఆ సమయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి వైఎస్ కు పిఆర్వో గా ఉండే వాడని గుర్తు చేశారు. నేడు సీఎం జగన్ కు వాయిస్ గా సజ్జల ఉన్నాడని మరోసారి సీపీఐ ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని తేల్చి చెప్పారు.

LEAVE A RESPONSE