రామాయణంలో పిడకల వేట

జరగని అవమానం జరిగినట్టు ఊహించుకుని
ద్వేషంతో రగిలిపోయాడు కురుసార్వభౌముడు..
ఫలితం..మహాసంగ్రామం..
బంధునాశనం.. ప్రాణహరణం.. రాజ్యభ్రష్టం..!

నువ్వు చేసినా..
నీ వాళ్ళు చేసినా
ఫలితం నీదే..
పండితక్లేశం
వాంఛనీయం కాదు..!

తప్పు లేదని..ప్రమేయం లేదని అనుకోవచ్చు..కాని జరిగింది మాత్రం అచ్చంగా
శంకరాభరణం ఓంకార నాదానుసంథానమే..
కొరవడింది నిదానమే..!

ఒక కార్యాలయంలో సామాన్య ఉద్యోగి పదవీ విరమణ సభ జరుగుతోంది..ఆ సభకి ఒక పెద్ద విఐపి ముఖ్య అతిధి..
అయినా గాని ఆ సభలో వక్తలు పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగి గురించే మాటాడాలి గాని, అదే పనిగా విఐపిని పొగడ్తలతో ముంచెత్తడం ఉచితం కాదు..!

సభా మర్యాదలు అనేకం ఉంటాయి..ఒక వ్యక్తి మాటాడుతుంటే..ఆ వ్యక్తి సామాన్యుడైనా..విఐపి అయినా మధ్యలో కొన్ని జరగకూడదు.. జరిగినా ఆపాలి..ప్రోత్సహించరాదు.. అవధాని కనక సరిపోయింది.. అదే ప్రధాని అయితే..!?

జరిగిందేదో జరిగింది..
తర్వాత ఆ రగడ ఏంటి..
ఆపాలి కదా…ముందులోనే అడ్డుకట్ట వేయాలి..
వీటిలోనూ ప్రమేయం లేదని
అనుకుంటే ఎలా..
ఈ రచ్చ మచ్చ కాదా..!?

– ఈ ఎస్కే
జర్నలిస్ట్

Leave a Reply