ఆయన అక్షరాల తోటమాలి

ఆయన అక్షరం ఒక తెలుగునాట ఒక చైతన్య ప్రభంజనం.
ఆయన భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ లాంటి ప్రబలశక్తినే ధీటుగా ఎదుర్కొన్నటువంటి ధీశాలి ధైర్యవంతుడు.
ఆయన హనుమంతుడిలాంటి శక్తిమంతుడు.
ఆయన ముందు కుప్పిగంతులా?
చరిత్రలో కొమ్ములుతిరిగిన కాకలుతీరిన ఎందరినో మహామహులను చిటికెవవేలుతో నొక్కేసిన చరిత్ర ఆయనది.
గత యాభై ఏళ్లుగా తెలుగునేల మీద తన అక్షరఖడ్గంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న నిలబెడుతున్న ఏకవీరుడు మార్గదర్శి.
పోయేకాలం వచ్చినవాళ్లే ఆయనతో పెట్టుకుంటారు.
ఆయనను వీళ్ళు వీళ్ళస్థాయిలో చూడాలంటే తలలు తొంభైడిగ్రీలు పైకి ఎత్తాలి, కానీ … ఆయన ఒక్క కనుచూపు క్రీగంటి సైగ చాలు వీళ్ళను నల్లని నలిపినట్లు నలిపేయడానికి, తెలుగుజాతిని ఈ రాక్షసమూకనుండి రక్షించడానికి కాపాడడానికి.
ఆయన ఎవరో ఈపాటికి మీకు తెలిసిఉండుండాలి.!
మీకు ఇంకా తెలియకపోతే, మీకు స్పృశించింకపోతే….,
ఆయన మరెవరోకాదు.!
తెలుగుజాతికి ఎవరెస్టు శిఖరసమానుడు, మేరునగధీరుడు “శ్రీ రామోజీరావు” గారు…..ఆయనే “ఈనాడు రామోజీరావు” గారు.
ఆ ఎవరెస్టు శిఖరం ముందు ఈ అరాచక ఫ్యాక్షన్ మట్టిదిబ్బలు, దోపిడీ పెంటకుప్పలు ఏపాటి?
ఆయన తన మూడోకన్నుతెరిస్తే, ఆయన కళ్ళు ఎర్రజేస్తే ఆఫ్ట్రాల్ వీళ్లేంత? వీళ్ళ బ్రతుకెంత?

~సువేరా

Leave a Reply