Suryaa.co.in

Telangana

రసమయి బాలకిషన్ ఉద్యోగాలు అమ్ముకొని అసలైన కళాకారులకు అన్యాయం చేస్తున్నారు

-ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగ కళాకారుల జేఏసీ నిరసన

తెలంగాణ వచ్చిన తర్వాత అసలైన కళాకారులకు న్యాయం జరగలేదని నిరుద్యోగ కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగ కళాకారుల జేఏసీ తమ ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు. ఆనాడు తెలంగాణ కోసం కళాకారులు ఎంతో కష్టపడ్డారని, కానీ నేడు ఆ కళాకారులకు గుర్తింపు లేదన్నారు.

సంస్కృతిక సారధి చైర్మన్ అయిన రసమయి బాలకిషన్ ఉద్యోగాలు అమ్ముకొని అసలైన కళాకారులకు అన్యాయం చేశారన్నారు. కళాకారులు కానీ 300 మందికి సంస్కృతిక సారధిలో ఉద్యోగ కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి అసలైన కళాకారులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే తెలంగాణ కోసం తాము ఏ విధంగా కష్టపడ్డాము ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దె దింపేందుకు కూడా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

LEAVE A RESPONSE