– సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్
గుంటూరు: కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ శాఖలలో అసిస్టెంట్ కమిషనర్ గా విలువైన సేవలందించిన ఐ.ఆర్.ఎస్ అధికారి బి. రవి కుమార్, విధి నిర్వహణలో ఉద్యోగులందరికి ఆదర్శంగా నిలిచారని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ కొనియాడారు.
శుక్రవారం ఉదయం లక్ష్మీపురంలోని ఎల్. వి. ఆర్ క్లబ్ ఫంక్షన్ హలులో జరిగిన రవికుమార్ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి కమిషనర్ ముఖ్య అతిధి గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా సుజిత్ మల్లిక్ మాట్లాడుతూ… విధి నిర్వహణలో అంకితభావం, నిరంతర శ్రమ, సామర్థ్యంతో రవి కుమార్ పనిచేసి, ఉత్తమ అధికారిగా మంచి గుర్తింపు పొందారన్నారు. ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించుకొని ఆశయసాధన తో పనిచేయాలని సూచించారు.
జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బి. లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. కృషి, పట్టుదలే సోపానాలుగా రవి కుమార్ మరింతగా ఎదిగారని ప్రశంసించారు. జిఎస్టీ జాయింట్ కమిషనర్ దేవ్ కుమార్ మాట్లాడుతూ..విధుల పట్ల విధేయత కలిగిన వారు తప్పక రాణిస్తారన్నారు.
పదవీ విరమణ చేయనున్న అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్ మాట్లాడుతూ..కమిషనర్ అందించిన ప్రోత్సహం, ఉద్యోగులందరి సహకారం తోనే తాను అమూల్యమైన సేవలను అందించగలిగానన్నారు. ఉద్యోగ అనుభవాలు వివరించి, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కమిషనర్ తదితర ఉన్నతాధికారులు మరియు ఉద్యోగులు రవికుమార్ ను ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందచేసారు.
కార్యక్రమంలో గజిటెడ్ అధికారుల సంఘ నాయకులు ఎం.నాగరాజు, కె. యుగంధర్, బి. నవీన్ రాజు మినిస్టీరియల్ సంఘ నేతలు శాఖమూరి శ్రీనివాస్, బిల్లా ప్రశాంత్ కుమార్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు టి. వివేకానంద, గద్దె తిలక్, పి.వి.సత్యనారాయణ, గుమ్మడి సీతారామయ్య చౌదరి, పి.కోటేశ్వరరావు, ఎన్. ఎస్. నగేష్ బాబు, కె. సాంబ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.