Suryaa.co.in

Andhra Pradesh

రాయదుర్గం టెక్స్ టైల్స్ పార్కు అభివృద్ధికి పెద్దపీట

-రాష్ట్ర బీసీ, సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు సవిత

అనంతపురం జిల్లా : రాయదుర్గం పూర్తి స్థాయి మౌలిక సదుపాయలు కల్పించి రాయదుర్గం టెక్స్ టైల్స్ పార్కును అభివృద్ధి చేయనున్నామని, టెక్స్ టైల్స్ పార్కులో ఖాళీగా ఉన్న ప్లాట్లను అర్హులకు కేటాయించనున్నామని మంత్రి సవితమ్మ తెలిపారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గారితో రాయదుర్గం టెక్స్ టైల్స్ పార్కును సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత విలేకరులతో సమావేశం లో మాట్లాడుతూ కాల్వ శ్రీనివాసులు ఎంపీగా ఉన్న సమయంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు రెండు టెక్స్ టైల్స్ పార్కును మంజూరు చేయించారన్నారు. వాటిలో రాయదుర్గంలో ఒకటి,కానూరులో మరో పార్కును ప్రారంభించారన్నారు. రాయదుర్గంలో టెక్స్ టైల్ప్ పార్కులో 2014-19 టీడీపీ ప్రభుత్వం హయాంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

55 వరకు ప్టాట్లు నిర్మించామని, వాటిలోని ఎనిమిదింటిలో వ్యాపారాలు సైతం ప్రారంభమయ్యారన్నారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ చేనేత పరిశ్రమను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కనీసం రాయదుర్గంలో ఉన్న టెక్స్ టైల్స్ పార్కును సందర్శించలేదన్నారు. ఈ పార్కులో ఉన్న ప్లాట్లను కొందరు అనర్హులకు ఇవ్వడం వల్ల వృథాగా పడి ఉన్నాయన్నారు.వాటిని అర్హులకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

ప్రస్తుతం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గతంలో మాదిరిగానే చేనేత రంగానికి ప్రాముఖ్యత నిస్తోందన్నారు. అందులో భాగంగా త్వరలో నూతన టెక్స్ టైల్స్ పాలసీని కూడా తీసుకురానుందన్నారు. ఈ నేపథ్యంలో రాయదుర్గం టెక్స్ టైల్స్ పార్కును అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. పార్కులు నూతన పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు.

మార్కెటింగ్ రంగంలో రోజు రోజుకూ చోటు చేసుకున్న మార్పులకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్రెండ్ తగ్గట్లుగా మార్కెటింగ్ నైపుణ్యాలు పెంచేలా వ్యాపారులకు, తయారీదారులకు శిక్షణివ్వనున్నట్లు మంత్రి తెలిపారు. రాయదుర్గంలో గార్మెంట్ పరిశ్రమలో వేలాది ఉపాధి పొందుతున్నారన్నారు. గార్మెంట్ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాయందుర్గం టెక్స్ టైల్స్ పార్కులో శిక్షణా కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

బయ్యర్లు, సెల్లర్లతో సమావేశాలు…

రాయదుర్గంలో ఉన్న టెక్స్ టైల్స్ పార్కును ఎమ్మెల్యేతో కలిసి మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఉత్పత్తి అయ్యిన వస్త్రాలు త్వరితగతిన అమ్మకాలయ్యేలా తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. టెక్స్ టైల్స్ పార్కుల దగ్గర గార్మెంట్స్ పరిశ్రమ నిర్వాహకుల తో సమావేశం నిర్వహించారు. వస్త్రాలకు మార్కెట్ సదుపాయం కలుగడమేకాకుండా, తయారీ దార్లకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. దీనివల్ల పరోక్షంగా లక్షలాది మంది కార్మికులకు లబ్ధికలుగుతుందన్నారు.

పరిశ్రమలకు పెద్దపీట

పూర్వం దేవతల చేసే యజ్ఞాలను రాక్షసులు భగ్నం చేసినట్లు… గడిచిన అయిదేళ్లలో జగన్ టీడీపీ హయాంలో అభివృద్ధి చెందిన చేనేత పరిశ్రమను గాలికొదిలేశారని మంత్రి సవితమ్మ మండిపడ్డారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్నింటింనీ నిలిపేసి, కేవలం జగనన్న నేతన్న హస్తం పథకం ఒక్కటే అమలు చేశారన్నారు. ఈ పథకం లబ్ధిదారుల ఎంపికలోనూ అనర్హులకు, వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మరోసారి సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం ద్వారా చేనేతకు భరోసా లభించిందన్నారు. 2014-19 నాటి పథకాలను మరోసారి అమలు చేయనున్నామని, నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకురానున్నామని మంత్రి వెల్లడించారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు నూతన టెక్స్ టైల్స్ పాలసీ ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతిస్తోందన్నారు. అన్ని రకాల అనుమతులతో రాయితీలుకూడా చంద్రబాబు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు .ఈ కార్యక్రమంలో చేనేత, టెక్స్ టైల్స్ పార్కు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE