Suryaa.co.in

Andhra Pradesh

రాయలసీమ అంటే బాబుకు కక్ష, కోపం..!

– సీమ రక్తం, పౌరుషం నీలో ఉందా బాబూ..?
– ఉంటే, సీమకు ఎందుకు తీరని ద్రోహం చేస్తావ్..?
– ఈ ప్రాంతంలో పుట్టి, రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు.
– సీమకొచ్చి.. బయట నుంచి తెచ్చిన నీపార్టీ కార్యకర్తలతో అమరావతికి జై కొట్టిస్తావా..?
– అంటేనే, సీమపై నీ దుష్ట బుద్ధి కనిపించడం లేదా..?
– రాయలసీమకు ద్రోహం చేసిన నిన్ను నమ్మం బాబూ..
– సీమలో హైకోర్టు పెట్టాలని ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయావ్..?
– రాష్ట్రాభివృద్ధి కంటే.. నీకు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారమే ముఖ్యమా..?
– అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలకు స్థానం ఉండక్కర్లేదా..?
– మంత్రి అంజాద్ భాషా

డిప్యూటీ సిఎం, మైనార్టీ శాఖ మంత్రి ఎస్బీ అంజాద్‌ బాషా మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

సీమ ద్రోహి చంద్రబాబుః

చంద్రబాబు నిజంగా రాయలసీమలో పుట్టి ఉంటే.. రాయలసీమ రక్తం, పౌరుషం చంద్రబాబుకు ఉంటే.. సీమకు ద్రోహం చేసేవాడు కాదు. ఈ ప్రాంత ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు. పులివెందుల వచ్చి.. చిన్న సందులో మీటింగ్ పెట్టి, వైఎస్ఆర్ గారి కుటుంబం గురించి చంద్రబాబు వీరావేశం తెచ్చుకుని మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి, సీమ వాసులను చంద్రబాబు దగా చేశారు. ఇప్పటికీ సీమ వాసులను క్షమాపణ కోరకుండా, ఈ గడ్డ మీద అడుగుపెట్టి బయట ప్రాంతాల నుంచి తెచ్చుకున్న కొంతమంది టీడీపీ కార్యకర్తలు చేత అమరావతి అని జై కొట్టిస్తున్నాడు. ఇంతకంటే ద్రోహం ఇంకేమైనా ఉంటుందా?

జగన్‌ కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. మరి, చంద్రబాబు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తాననిగానీ, న్యాయ రాజధాని పెడతాననిగానీ ఒక్కమాట చెప్పలేకపోయాడు. అంటే.. చంద్రబాబుకు “అమరావతి ముద్దు- మిగతా ప్రాంతాలు వద్దు” అన్నదే అతని నినాదం. అమరావతిలో తన బినామీల ద్వారా జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, తద్వారా అతని సామాజిక వర్గం బాగుండాలని కోరుకుంటున్నాడు. ఇదా ఒక నాయకుడు కోరుకోవాల్సింది. సీమ ప్రాంతం, సీమ ప్రజలు ఏమైనా పర్వాలేదనేది చంద్రబాబు అనుకుంటున్నారు.

ఆ ధైర్యం బాబుకు ఉందా..?
రాష్ట్ర ప్రజలకు, ప్రతి కుటుంబానికీ మా ప్రభుత్వం మేలు చేస్తేనే మాకు ఓట్లు వేయమని జగన్ మోహన్ రెడ్డిగారు కోరుతున్నారు. అలా కోరే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా? చంద్రబాబు, తన హయాంలో ఎప్పుడూ కుల రాజకీయాలు, కక్ష సాధింపు, కుట్ర రాజకీయాలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ మీద కక్ష, కోపం, ఆక్రోశం పెంచుకున్నారు. ఏనాడూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచించని వ్యక్తి చంద్రబాబు.

అప్పుడు ముఖ్యమంత్రి నీవే కదా బాబూ..?
పులివెందుల వచ్చి వివేకానందరెడ్డి గారి హత్యపై చంద్రబాబు మాట్లాడారు. ఆనాడు హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా? ఎందుకు ఆనాడు విచారణ చేయించలేదు. వివేకానంద రెడ్డి హత్యపై వ్యవస్థలను మేనేజ్ చేసింది చంద్రబాబు కాదా? ఆరోజున బీటెక్ రవిని, ఆదినారాయణ రెడ్డిని ఎందుకు విచారించలేదు. బీటెక్ రవిని, ఆదినారాయణ రెడ్డితో పాటు చంద్రబాబును కూడా విచారించాలని కోరుకుంటున్నాను.

-వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను డైవర్ట్ చేసిన వ్యక్తి చంద్రబాబే. ఈరోజు వైఎస్ కుటుంబం మీద బురదచల్లే కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నారు. వైఎస్ రాజారెడ్డి ని చంపిన వారిని కూడా వైఎస్ కుటుంబం వదిలేసి, క్షమాభిక్ష పెట్టింది. అలాంటి కుటుంబం మీద నేరచరిత్ర ముద్ర వేయాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నాడు.

బాబుది ముమ్మాటికీ నేర చరిత్రేః
చంద్రబాబుది ముమ్మాటికీ నేరచరిత్రే. రాష్ట్రంలో చంద్రబాబును మించిన నేరచరిత్ర ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? నారాసుర రక్తచరిత్ర ఎవరిది? గతంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ పింగళి దశరథ్ రామ్‌ మొదలు.. వంగవీటి మోహన రంగా, రాయలసీమలో మా పార్టీ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డిని, అనంతపురం జిల్లాలో వందలాదిమంది వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను చంపించింది నువ్వు కాదా చంద్రబాబూ…?. ఇప్పుడేదో సీమను ఉద్ధరిస్తానంటున్న చంద్రబాబు మాటలు విని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

నీవు పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా?
చంద్రబాబుకు ఒక మునిశాపం ఉందని దివంగత వైఎస్ఆర్‌ ఎప్పుడో చెప్పారు. ఏనాడు అయినా, ఆయన నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలు అవుతుందట. ఆ ముని శాపం దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఏరోజూ నిజం మాట్లాడరు. నీవు శంఖుస్థాపన చేసి, పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటైనా ఉందా..?. రాయలసీమ ప్రాజెక్టులంటే గుర్తొచ్చేది మహానేత వైఎస్ఆర్.. ఆ తర్వాత జగన్ గారే.

– పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే.. ఏడ్చింది నీవు కాదా బాబు..
– రాయలసీమ లిఫ్ట్ ను అడ్డుకుంటున్నది నీవు కాదా బాబు?
– ఈ ప్రాంతం కోసం నిరంతరం తపిస్తున్న నాయకుడి మాట నమ్ముతామా? ఈ ప్రాంతంలో పుట్టి సీమకు ద్రోహం చేసిన ద్రోహిని నమ్ముతారో ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు గుణపాఠం చెప్పి, కుప్పంతో సహా 175 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగరవేస్తారనే నమ్మకం, విశ్వాసం మాకు ఉంది. వైఎస్‌ కుటుంబం మీద ఎంత బురద జల్లే కార్యక్రమం చేసినా పులివెందుల ప్రజలెవ్వరూ చంద్రబాబును నమ్మరు.

మైనార్టీ హక్కుల రక్షణపై నీ స్టాండ్ ఏమిటి బాబూ?
చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌ మతతత్వ పార్టీ బీజేపీతో జతకట్టాడు. మరోవైపు చంద్రబాబు పవన్ కల్యాణ్ కు మద్దతిస్తున్నాడు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనే తాపత్రయంతో పవన్ కల్యాణ్ అందర్నీ నోటికొచ్చినట్లు విమర్శిస్తున్నాడు. మైనార్టీ హక్కుల సంరక్షణపైన ఇంతకీ చంద్రబాబు స్టాండ్ ఏమిటి?. నీ స్టాండ్ ఏమిటో పులివెందులలో ఎందుకు చెప్పలేకపోయావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వ్యతిరేకి చంద్రబాబు. ఈ సామాజిక వర్గాలకు అదిచేస్తా.. ఇది చేస్తానని మరోసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారు.

అమరావతిలో పేదలు ఉండకూడదా..?
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. అమరావతి అనేది ఔట్‌ డేటెడ్ రాజధాని. అమరావతిలో 50 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలలకు ఇళ్ల పట్టాలు ఇస్తే.. దానికి చంద్రబాబు అడ్డుపుల్ల వేస్తున్నారు. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు ఉండేందుకు స్థానం లేదా?

కేవలం చంద్రబాబు సామాజిక వర్గం వారే ఆ రాజధానిలో ఉండాలా? వారే రియల్ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవాలా… వారే కోటీశ్వరులై లబ్ది పొందాలని చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారు. ఇప్పటికే చంద్రబాబుకు బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదు. అవాస్తవాలు, అబద్ధాలే చంద్రబాబు రాజకీయ విధానం. చంద్రబాబు మాట్లాడిన దాంట్లో ఒక్కటంటే ఒక్కటీ నిజం లేదు.

 

LEAVE A RESPONSE