మద్యం అవినీతి కుంభకోణంపై సీబీఐ విచారణ

మద్యం తయారీ సంస్ధలన్నీ వైసీపి కనుసన్నల్లోనే
ఏపీలో ఆరోగ్యానికి పూర్తి హాని కరమైన పదార్ధాలతో మద్యం తయారీ
15 రూపాయలకు తయారు చేసే ఒక మద్యం సీసాను ఆరేడు వందలకు అమ్ముతున్నారు
పంపే సరుకును బట్టి.. ప్యాలెస్ లో కప్పం
ఒక రోజుకు 160కోట్లు ఆదాయం, నెలకు 4,800కోట్లు ఆదాయం
ఏడాదికి వచ్చే సరికి 56,700కోట్లు
బడ్జెట్ లోమద్యం ద్వారా ఆదాయం 20వేల కోట్లు
మరి 36,700కోట్లు ఎక్కడకు వెళుతున్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి?
ఇంతకంటే పెద్ద కుంభకోణం ఏమైనా ఉంటుందా?
– వైసీపీ మద్యం దోపిడీ ఫై ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్‌

రాష్ట్రంలో మద్యం అవినీతి కుంభకోణం పైన సీబీఐ విచారణను కోరుతున్నాం.ప్రతిపక్ష నేతగా మద్య నిషేదమని చెప్పిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక తానిచ్చిన హమీకి తూట్లు పొడిచి, తన వారితో మద్యం వ్యాపారం చేయిస్తూ నాసిరకపు మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ, వేలకోట్లు అవినీతి చేస్తున్నారు. ఈ అవినీతిని సీబీఐ మాత్రమే బయటకు తీయగలరు.

ఈ నాసిరకపు లిక్కర్ తాగడం వల్లే ఎంతోమంది అనారోగ్యానికి గురై చనిపోయారు .ఈ మరణాలపై కచ్చితంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం మద్యం స్కాం కు పాల్పడుతున్న తీరును ప్రజలకు తెలియ చేస్తాం. మద్యం తయారీ సంస్ధలు అన్నీ వైసీపి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. బ్రెవేరేజస్ పై అప్పుతీసుకున్న సందర్భంలో వారికిచ్చిన హామీని పరిశీలిస్తే ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్ధం అవుతుంది. మద్యం అమ్మకాలు పై ఎటువంటి నిషేధం విధించకుండా అమ్మకాలు సాగిస్తామని హామీ ప్రభుత్వం ఇవ్వడం పై పురందేశ్వరి తీవ్రంగా తప్పుపట్టారు.

ఎన్నికలలో ఓట్ల కోసం మద్యం గురించి, ప్రజల ఆరోగ్యంల గురించి జగన్ చాలా గొప్పగా చెప్పారు
నేడు మద్యం ద్వారా వేల కోట్ల అవినీతి జరుగుతుందనేది నిజం..గతంలో రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్ లను పూర్తిగా మార్చేశారు..కొత్త బ్రాండ్ లను మార్కెట్లోకి తెచ్చి.. వాటి ద్వారా దోచుకుంటున్నారు.

గతంలో ఉన్న యాజమాన్యాల నుంచి కంపెనీలు లాక్కుని..పేర్లు మార్చి అధికార పార్టీలో ఉన్న ముఖ్య నేతలు వీటిని నడుపుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీనే కంపెనీ ఇవ్వనంటే.. ఆయన తయారు చేసిన మద్యాన్ని కొనకుండా పక్కన పెట్టేశారు..ఏపీలో ఆరోగ్యానికి పూర్తి హాని కరమైన పదార్ధాలతో మద్యం తయారీ జరుగుతుంది.

15 రూపాయలకు తయారు చేసే ఒక మద్యం సీసాను ఆరేడు వందలకు అమ్ముతున్నారు
మహిళల పుస్తెలు తెగిపోయినా పర్వాలేదు.. బిడ్డల భవిష్యత్ నాశనం అయినా పర్వాలేదు.. కుటుంబాలు చిద్రమైన పర్వాలేదు.. జగన్ కు డబ్బులే కావాలి… అదేమంటే.. ఈ పధకాల పేరు చెబుతారు ..తన ఓటు బ్యాంకును పదిల పరచుకోవడానికి జగన్ శవాల మీద పేలాలు వేరుకునే విధంగా వ్యవహరిస్తున్నారు
ఈ చీప్ లిక్కర్ తాగడం వల్లే ఎంతోమంది అనారోగ్యానికి గురై చనిపోయారు .ఈ మరణాలపైకచ్చితంగా సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ వివరాలను ప్రజల్లోకి వెళ్లి జగన్ చేసే మోసాలను వివరిస్తాం. చీప్ లిక్కర్ తాగించి వారి ప్రాణాలతో ఆడుకుంటూ కోట్లు దోచుకుంటున్న వైనాన్ని చెబుతాంమద్యం తయారీకి సంబంధించి గుత్తాధిపత్యం మొత్తం ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుంది. మద్యం కంపెనీలు తయారు చేసిన సరఫరా వివరాలు తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతాయి. ఆ కంపెనీలు వారు పంపే సరుకును బట్టి.. ప్యాలెస్ లో కప్పం కట్టాలి.

రోజుకు యనభై లక్షల మంది మన దగ్గర మద్యం తాగుతున్నారని అంచనా. అంటే ఒక రోజుకు 160కోట్లు ఆదాయం, నెలకు 4,800కోట్లు ఆదాయం. యేడాదికి వచ్చే సరికి 56,700కోట్లు. కానీ రాష్ట్రంలో బడ్జెట్ లో 20వేల కోట్లు ఆదాయం మద్యం ద్వారా వస్తున్నాయని చూపుతున్నారు. మరి 36,700కోట్లు ఎక్కడకు వెళుతున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి ఈ మద్యం ఆదాయం పై ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలి. ఇంతకంటే పెద్ద కుంభకోణం ఏమైనా ఉంటుందా?మహిళలు కూడా ఆలోచన చేయాలి.. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న వారికి బుద్ది చెప్పాలి.

చంద్రబాబు అరెస్టుపై మీడియా అడిగిన ప్రశ్నలకు.. బీజేపీ ఎపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సమాధానాలు చెప్పారు
ఈనెల 9వ తేదీ నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం.371 కోట్ల అవినీతి స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో జరిగిందని చంద్రబాబును జైలుకు పంపారు. ప్రకాశం జిల్లాలో ఈ స్కీం జరిగిన తీరు నేను వాకబు చేశాను. కొన్ని కేంద్రాల్లో నైపుణ్యాభివృద్ది కోసం 54 సెంటర్లు ఏర్పాటుచేసి పరికరాలు ఇచ్చారు. సీఐడీ అధికారులు ఇటువంటి కేంద్రాలకు వెళ్లి విచారణ చేశారా అనే అనుమానం ఉంది. చంద్రబాబు అరెస్టు జరిగిన తీరును మేము ప్రశ్నిస్తున్నాం.
అవినీతి ఎవరు చేసినా శిక్షించాలనే చెబుతున్నాం.అవినీతి జరిగిందని చెప్పడానికి మేము ఎవ్వరం?అది రేపు కోర్టులో న్యాయమూర్తి నిర్ణయిస్తారు.సీఐడీ విచారణ పూర్తిస్థాయిలో చేసిందా లేదా అనే అనుమానం మాకుంది.మీరు రిమాండ్ కు పంపారు… వాదోపవాదాలు అయ్యాక వాస్తవాలు బయటకు వస్తాయి.మీడియా సమావేశంలొ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ, శిరీష, ఇమిడిశెట్టి సుమతి తదితరులు పాల్గొన్నారు.