Suryaa.co.in

Andhra Pradesh

మీరు సిఐడి విచారణ అధికారులా? లేక వైసీపీ అధికార ప్రతినిధులా?

– మీరు న్యాయాధికారులా…వైసీపీ దుష్ప్రచారకర్తలా?
– ప్రతి నెలా రూ.300 కోట్లకు పైగా అక్రమాలు జరుగుతున్నాయి
– క్యాష్ ను కంటైనర్లలో తరలిస్తున్నారు
– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

విజయవాడలో 2 సార్లు, హైదరాబాద్ లో ఒకసారి, ఢిల్లీలో మరోసారి ప్రెస్ మీట్లు పెడతారా?కోర్టుల్లో చెప్పకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్పదలచుకున్నారు. మీరు న్యాయాధికారులా…వైసీపీ దుష్ప్రచారకర్తలా? 2016 లోనే కెపిఎంజీ అనే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన స్కిల్‌డెవలప్‌మెంట్ ప్రాజెక్టును ఒక కేస్‌స్టడీగా తీసుకుని తమ వివేదికలో పేర్కొంది.

ఆ రిపోర్టులో 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ లు, 36 స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గతంలో వై.ఎస్ హయాంలో ఇలా చేసిన అధికారులకు ఏ గతిపట్టిందో గుర్తుంచుకోండి. 5 సార్లు ప్రేమచంద్రారెడ్డి చెక్కులపై సంతకాలు చేశారు. నాడు సెక్షన్ ఆఫీసర్ గా ఉన్న నేటి సెక్రటరీయేట్ ఉద్యోగ సంఘ నాయకుడు వెంకట్రామిరెడ్డి నోట్ ఫైల్ ఇనిషియేట్ చేశాడు…అజేయ కల్లాం రెడ్డి ప్రాజెక్టును ప్రతిపాధించాడు…వారిని ఎందుకు వదిలిపెట్టారు? సీమెన్స్ కు సంబంధం లేదని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో 20 కంపెనీ అధికారులు పాల్గొన్నారు. అగ్రిమెంట్‌పై ఆ కంపెనీ మాజీ మేనేజింగ్ డైరక్టర్ సుమన్ బోస్, ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతోష్ సావంత్ సంతకాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆరోపణలు చేశారు. ఆధారాలు చూపించలేదు.

వివరణ ఇచ్చుకునేందుకు కూడా ఆయనకు సమయం ఇవ్వలేదు. శిక్ష మాత్రం వేసేశారు. నాడు జగన్ రెడ్డిని అరెస్టు చేయక ముందు 5 సార్లు అవకాశం ఇచ్చి వివరణ తీసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడిని హఠాత్తుగా వచ్చి ఏ విధంగా అరెస్టు చేస్తారు.?సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైసీపీ అధికార ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరూ సీఎం జగన్ రెడ్డి ప్రాపకం కోసం, ఆయన ద్వారా లబ్ధి పొందడం కోసం తంటాలు పడుతున్నారు. ఒకాయన ఐపీఎస్ అధికారిగా, మరొకాయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటున్నామనే విషయాన్ని కూడా మరిచిపోయారు.హుందాగా వ్యహరించాల్సిన వారు జోకర్లుగా తయారయ్యారు.

విజయవాడలో రెండు సార్లు, హైదరాబాద్ లో ఒకసారి, ఢిల్లీలో ఇంకోసారి ప్రెస్ మీట్లు నిర్వహించారు. కేసుకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించడం పక్కన పెట్టి ప్రెస్ మీట్ల ద్వారా చంద్రబాబు నాయుడిపై నిందలు మోసి, వారు పెట్టిన అక్రమ కేసులను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఐడీ చీఫ్ పొలిటకల్ ప్రెస్ మీట్లు పెట్టడం, ఏఏజీ భజన చేయడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసి వీళ్లు చేసిన తప్పును, ఏపీ ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరూ ఛీకొట్టే పరిస్థితి వచ్చింది.

చేసిన తప్పునకు సిగ్గుతో తలదించుకోవాల్సిందిపోయి వరుస ప్రెస్ మీట్లతో రాజకీయ నాయకులను తలపిస్తున్నారు.ఆ ప్రెస్ మీట్లలోనూ ప్రేమ్ చంద్రారెడ్డి, అజేయ్ కల్లాంరెడ్డి గురించి ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు.వైఎస్సార్ హయాంలో జగన్ రెడ్డి చెప్పిందల్లా చేసిన అధికారులకు ఏ గతి పట్టిందో అందరం చూశాం. సీనియర్ ఐఏఎస్ అధికారి జైలు నుంచి బయటకు దూగాడుతూ వచ్చిన విషయం. గుర్తుకుతెచ్చుకోండి . జగన్ రెడ్డికి వంత పాడిన వారికి ప్రత్యేక చట్టాలేమి ఉండవు..చట్టం ముందు అందరూ సమానులే.సీమెన్స్ కంపెనీకి ఈ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటి వరకు అబద్ధాలు చెబుతూ వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి 20 మంది సీమెన్స్ కంపెనీ అధికారులు పాల్గొన్నారని, అగ్రిమెంటుపై సీమెన్స్ ఎండీ సుమన్ బోస్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతోష్ రావత్ సంతకాలు చేశారు.

ఈ విషయాన్ని నిన్న సుమన్ బోస్ మీడియా సాక్షిగా వెల్లడించారు. గతంలో జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఐదు సార్లు విచారణకు పిలిచి వివరణ తీసుకున్నారు.ఆయా కేసులకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు ఓపెన్ గా రుజువు కావడంతో 16 నెలలు జైలులో ఉన్నారు. కేపీఎంజీ అంతర్జాతీయ స్థాయిలో 150 దేశాల్లో పరిశ్రమలకు ర్యాంకింగ్ ఇచ్చే సంస్థ.అటువంటి ప్రతిష్టాత్మక సంస్థే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీమెన్స్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టును ప్రశంసించింది.స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు ద్వారా కంపెనీలకు ఉపయోగపడేలా స్కిల్డ్ ఉద్యోగులు, సిబ్బందిని తయారుచేస్తున్నారని రిపోర్టు ఇచ్చింది.రూ.371 కోట్లలో ఒక్క రూపాయి దుర్వినియోగం అయినట్టు, అవినీతి జరిగినట్టు నిరూపించలేకపోయారు. ప్రతి రూపాయికీ లెక్క ఉంది. కొండను తవ్వి ఎలుకను పట్టారు.

శిక్షణ కేంద్రాలకు పంపిణీ సామగ్రి, రవాణా చేసిన లారీల ఇన్వాయిస్ లు, శిక్షణ పొందిన 2.13 లక్షల మంది వివరాలు ఉన్నాయి.46 ఇంజనీరింగ్ కళాశాలలు, 36 పాలిటెక్నిక్ లలో రోబో మిషన్లు, కంప్యూటర్లు తదితర సామగ్రి ఉన్నాయి.ఆ కంపెనీ ప్రతినిధుల మెడపై కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు నేరం చేసినట్టు చెప్పాలని ఒత్తిడి తెచ్చినా వారు లొంగలేదు.కంపెనీల ప్రతినిధులను అరెస్ట్ చేసిన సమయంలో విచారించిన హైకోర్టు ఒక్క సాక్ష్యాధారం కూడా లేదని మందలించి బెయిల్ మంజూరు చేసింది.ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ 38వ నిందితుడిగా చేర్చారు.

భారతదేశాన్ని డిజిటల్ ఇండియాను మార్చాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తపన పడుతున్నారు. ఏపీలో జగన్ రెడ్డి మాత్రం డిజిటల్ వద్దు క్యాషే ముద్దంటున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏడేళ్ల కాలంలో రూ.200 కోట్లు అయితే ఏపీలో ప్రతి నెలా రూ.300 కోట్లకు పైగా స్కామ్ జరుగుతోంది.డిస్టలరీస్ ను జగన్ రెడ్డి సొంత మనుషుల చేతుల్లో పెట్టుకుని నాసిరకం మందును తయారుచేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు.ఇసుక విషయంలోనూ ప్రతి నెలా రూ.300 కోట్లకు పైగా అక్రమాలు జరుగుతున్నాయి. క్యాష్ ను కంటైనర్లలో తరలిస్తున్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితం, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించిన చంద్రబాబు నాయుడిని తప్పుడు కేసులో జైలులో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడు.

నిడదవోలు సభలో సీఎం జగన్ రెడ్డి ముఖం చూస్తే చంద్రబాబు నాయుడికి ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్న సపోర్టును చూసి జీర్ణించుకోలేకపోతున్నాడనే విషయం స్పష్టంగా అర్థమైంది.జగన్ రెడ్డిని పొగుడుకుంటూ, ఆయన చెప్పిందల్లా అడ్డంగా చేస్తూ పోతున్న అధికారులందరూ అనుభవించక తప్పదు.

LEAVE A RESPONSE