Suryaa.co.in

Telangana

కాళేశ్వరం ఎంత డొల్ల ప్రాజెక్టో ఎన్డీఎస్ఏ నివేదికను చదివి తెలుసుకోండి

– బీఆర్ఎస్ నేతల అవినీతిని బీజేపీ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు
– కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరగాలని రాహుల్ గాంధీ చెప్పిన మాటలను మార్చిపోయారా?
– బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

హైదరాబాద్: కాళేశ్వరం అవినీతి నుండి బయటపడేందుకు బీఆర్ఎస్ నేతలు అపసోపాలు పడుతున్నారు. బీఆర్ఎస్ నేతలారా….కాళేశ్వరం ఎంత డొల్ల ప్రాజెక్టో ఎన్డీఎస్ఏ నివేదికను చదివి తెలుసుకోండి. ఐఐటిలో చదువుకున్న అత్యున్నత మేధావులు, నిపుణుల బృందం కాళేశ్వరం సందర్శించి లోపాలను ఎత్తి చూపింది. కాళేశ్వరంలో జరిగిన అక్రమాలు, నాణ్యతా లోపాలు, మొరాయించిన మోటార్లు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది. అయినా ఎన్డీఎస్ఏ నివేదికను బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టడాన్ని ఖండిస్తున్నా.

పీసీ ఘోష్ కమిషన్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కారుకూతలు కూశారు.

బీఆర్ఎస్ నేతల అవినీతిని బీజేపీ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరగాలని రాహుల్ గాంధీ చెప్పిన మాటలను మార్చిపోయారా? అసెంబ్లీ లోపల, బయట కూడా సీఎం, మంత్రులు కాళేశ్వరం అవినీతిపై మాట్లాడారు కదా?

పీసీ ఘోష్ కమిషన్ విచారణను నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోంది. బీఆర్ఎస్ చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు. కాళేశ్వరం పై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నా.

LEAVE A RESPONSE