-జగన్ రెడ్డి తప్పిదం వల్లే అప్పర్, లోయర్ కాఫర్ డ్యాం వర్కింగ్ ప్లేస్ లో నీళ్లు నిలబడ్డాయి
-జగన్ రెడ్డి నిర్లక్ష్యం వలనే నిర్వాసితులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు
-ముఖ్యమంత్రి, మంత్రి కనీస పరిజ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటే యంత్రాంగం ఏం చేస్తోంది?
-గోదావరి నది మీద పులిచింతల కట్టేంత తెలివైన వాళ్లు నిర్వాసితులని ఏ విధంగా కాపాడతారు?
-రాజశేఖర్ రెడ్డి పార్థివదేహం దగ్గరే జగన్ రెడ్డి పోలవరం కాంట్రాక్టర్లతో బేరం పెట్టాడు
-అంబటి రాంబాబు వాస్తవాలను తెలుసుకోకుండా మీడియాను తిడితే ఏం వస్తుంది?
– మాజీ మంత్రి వర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు
వరదలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పోలవరం ముంపు గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో కొండలు, గుట్టలు ఎక్కి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రజలందరూ పెద్ద ఎత్తున ఆహాకారాలు చేస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం తాడేపల్లి ఏసీ గదుల్లో కూర్చొని రివ్యూలు చేస్తున్నారు. జూన్, జూలై లో వరదులు రాక ఎండలొస్తాయా?
ముఖ్యమంత్రి, జలవనరుల శాఖా మంత్రి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటే యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు? ముఖ్యమంత్రి అసమర్థుడు, అవగాహన లేదు, పరిపాలన అనుభవం లేదు, ఇరిగేషన్ మంత్రి కొత్తగా వచ్చాడు. గోదావరి నది మీద పులిచింతల కట్టేంత తెలివైన వాళ్లు గోదావరి వరద బాధితులని, గోదావరి ముంపు మండలాల ప్రజలని, నిర్వాసితులని ఏ విధంగా కాపాడతారు. అంబటి రాబాంబుకి ఎందుకు ఇంత ఆక్రోశం?
పోలవరం డ్యామ్ కు అంజయ్య శంకుస్థాపన చేశారు. పవర్ ప్రాజెక్టు కొట్టేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో ఈసీఆర్ఎఫ్ డ్యామ్, స్పిల్ వే పనులని ప్రీ క్లోజర్ చేసింది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కాదా? అంబటి రాంబాబు కొత్తగా వచ్చి అన్ని తెలుసుకొని మాట్లాడాలి? ఎవరో ఏదో కాగితాలు ఇస్తే ఆక్రోశంతో మాట్లాడితే ఎలా? ఒక బాధ్యత గల మంత్రిగా బాధ్యతగా మాట్లడాలి. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన రోజు పార్థివదేహం వచ్చినప్పుడే పవర్ ప్రాజెక్టు, స్పిల్, ఎర్త్-కమ్-రాక్-ఫిల్ డ్యామ్ పనులు కలిపి ఒక టెండర్ గా అప్ లోడ్ చేసేశారు. జగన్ రెడ్డి వై.యస్. రాజశేఖర్ రెడ్డి పార్థివదేహం దగ్గరే కాంట్రాక్టర్లతో బేరం పెట్టాడు. అది నిజమో కాదో పోలవరం కట్టే కాంట్రాక్టర్లను అడిగి ఎంత కమీషన్ అడిగాడో, ఎన్ని కోట్లు అడిగి పవర్ ప్రాజెక్టు ఇస్తానన్నాడో అంబటి రాంబాబు తెలుసుకోవాలి?
జగన్ అడిగినంతకు బేరం కుదర్లేదు, రోశయ్య తనకెందుకు అనుకొని పనులన్నింటిని ఆపేశాడు. రాజశేఖర్ రెడ్డి చేసిన ద్రోహానికి కాలువలు తవ్వి మట్టిని పందికొక్కుల్లా దోచుకోవడటంతో మళ్ళీ టెండర్లు ఫైనల్ అవడానికి నాలుగున్నరేళ్లు పట్టింది. 2013లో ట్రాన్స్ ట్రాయ్ వచ్చింది.2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి డ్యామ్ దగ్గరికి వెళ్ళినపుడు స్పిల్ వే, కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, డౌన్ స్ట్రీమ్, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలెట్ ఛానల్ తవ్విన ప్రాంతంలో సుమారు 7 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు ఖాళీ చేయడానికి కాంగ్రెస్ హయాంలో డబ్బులు ఇస్తే వాటిని దళారులు తినేశారు.
చంద్రబాబు నిర్వాసితులకి డబ్బులు ఖర్చుపెడితేనే ఆ గ్రామాలు ఖాళీ చేసాయి. ఆ గ్రామాలు ఖాళీ చేసాయి కాబట్టే ఎస్కవేషన్ జరిగింది…7.34 కోట్లాది క్యూబిక్ మీటర్ల మట్టి తీశారు, కొండలను తొలగించారు, రాళ్లను తీశారు. స్పిల్ వే కాంక్రీట్ దాదాపు 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ లో చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత కాంక్రీట్ వేశారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 24 గంటలలో 32వేల 535 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారని నమోదు అయింది.
అంబటి రాంబాబు వాస్తవాలను తెలుసుకోకుండా ఈనాడు, రామోజీరావు, ABN రాథాకృష్ణ, TV5 నాయుడు తిడితే ఏం వస్తుంది. జగన్ రెడ్డికి చేతనైతే నిర్యాసితులకు కావల్సిన నిత్యావసర సరుకులని పంపిణీ చేసి ఆదుకోవాలి గాని ఇష్టానుసారంగా ప్రతిపక్షాలను, పత్రికలను దూషిస్తే ఏం లాభం? టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు వంతుల రాజేశ్వరి, శ్రీనివాస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు బియ్యం, కూరగాయలు పంపిణీ చేస్తూ నిర్వాసితులను ఆదుకుంటున్నారు.
అధికారపక్షం నాయకులు, కార్యకర్తలు నిర్వాసితులను, వరద బాధితులను ఆదుకోకుండా ఏం చేస్తున్నారు? ఒక్కరైనా వరద గురించి సమావేశం పెట్టారా. పవర్ ప్రాజెక్టు కొట్టేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో జరుగుతున్నపనులని రద్దు చేశారు. పోలవరం డ్యామ్ గురించి చర్చించడానికి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి మేము సిద్ధం.
తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అనర్ధాలు జరుగుతాయని పోలవరం ప్రాజెక్టు అధారిటీ హెచ్చరించినా జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2019 నవంబర్ దాకా ఉన్న నవయుగ కాంట్రాక్టరును బలవంతంగా ఎల్లగోట్టి రివర్స్ టెండరింగ్ డ్రామాలాడారు. ఇద్దరు కాంట్రాక్టర్లకి పోటీ పెడతానని ఒక్క కాంట్రాక్టరుకే కాంట్రాక్టు ఇప్పించి రెండేళ్లల్లో పోలవరం డ్యామ్ పూర్తి చేస్తానని పోయిన మంత్రి నెలలకు నెలలు డెడ్ లైన్స్ ప్రకటించారు. 2019లో 15 లక్షల ఫ్లడ్ వచ్చి స్పీల్ ఛానల్ ద్వారా, పైలెట్ ఛానల్ ద్వారా గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్లాయి.
2020లో 23 లక్షల ఫ్లడ్ వచ్చినప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? సమస్యను సెంట్రల్ వాటర్ కమీషన్, పోలవరం అథారటీ కమిషన్, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చారా. అందరు కలిసి ఏ నిర్ణయాలు తీసుకున్నారు? అదేం లేకుండా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము చేస్తున్నామని అంబటి అనడం అవివేకం. త్వరితగతిన నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే డయాఫ్రమ్ వాల్ మీద ఎర్త కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులు, అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం పనులు పూర్తి చ సుకోవచ్చు. అందుకుగాను వెంటనే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లిఖిత పూర్వకంగా రివ్యూ సమావేశంలో రాష్ట్ర జల వనరుల అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.
కేంద్రమంత్రి షెకావత్ రెండేళ్లకు ముందు ఈ ప్రాజెక్టు దగ్గరికి వచ్చింటే ఈ గతి పట్టేదు కాదు అని వైసీపీ నాయకులను మందలించారు. చంద్రబాబు నాయుడు చేసిన పనులకు గాను రూ. 4వేల కోట్లు తీసుకొని లిక్కర్ కాంట్రాక్టులకి అడ్వాన్స్ లు ఇచ్చుకున్నారు. రూ.55,548 కోట్లు టెక్నికల్ అడ్వైజర్ కమిటీలో చంద్రబాబు నాయుడు 2019 ఫిబ్రవరిలో ఆమోదం తీసుకొచ్చారు. జూలై 2022వరకు మీరు ఆమోదం తెచ్చుకోలేదు.
వరదలకు నిర్వాసితులు 5 అడుగుల లోతు నీళ్లలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అన్నం పెట్టి, నీళ్లు ఇచ్చేవాళ్ళు లేక మందులు ఇచ్చేవాళ్లు లేక, హెల్త్ క్యాంపులు లేక, షుగర్ పేషంట్లు అల్లాడిపోతుంటే కొచ్చమైన మీకు జాలి ఉందా. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ముఖ్యమంత్రి తాడేపల్లిలో కూర్చుని 350కిమీ ల దూరంలో కలెక్టర్లని పెడతారా? ఎక్కడ పాడేరులో కలెక్టరు, జాయింట్ కలెక్టరు, పోలవరం నిర్వాసితులు ఎక్కడ?
నేడు భద్రాచలం ప్రాంత ప్రజలు, తుమ్మల నాగేశ్వరరావు, రైతాంగం అంతా కూడా చంద్రబాబు నాయడు గారికి దండాలు పెడుతున్నారు ఆయన చేసిన మంచిని గుర్తుచేసుకుంటున్నారు. టీడీపీ 5 ఏళ్లల్లో కేంద్ర జలవనరుల శాఖ, పిపిఏ ఆధ్వర్యంలో పోలవరాన్ని 71 శాతం పూర్తి చేశారువైసీపీ చేసిన చారిత్రాత్మక తప్పిదం లోయర్ కాపర్ డ్యాం నిర్ణీత ఎత్తు పెంచక పోవడం వల్ల గోదావరి నీళ్లు తిరిగి అప్పర్, లోయర్ కాపర్ డ్యాం మధ్యలో వర్కింగ్ ప్లేసుల్లో నీళ్లు నిలబడ్డాయి. పోలవరం పనులు ఆగిపోయాయి.