– ప్రాంతీయ పార్టీల పై సంచలన వ్యాఖ్యలు
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
– ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మహిళలకోసం ప్రవేశ పెట్టిన పధకాలు వివరించాలి
విజయవాడ: ప్రాంతీయ పార్టీల పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మహిళామోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శక్తిందన్ పేరిట నిర్వహించిన రాష్ట్రస్ధాయి సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ ప్రాంతీయ పార్టీలు మహిళా సంఘాలను రాజకీయంగా స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు.
స్వయం సహాయక సంఘాలకు కేంద్రప్రభుత్వం నిధులిస్తే అసలు స్వయం సహాయక సంఘాలకు తామే ఆధ్యులమంటూ ప్రచారం చేసుకున్న నేతలను చూసామంటూ పురందేశ్వరి తన ప్రసంగంలో నర్మగర్భంగా ప్రస్తావిస్తూ చివరిలో ఈ ప్రాంతీయ పార్టీల వైఖరిలను ఎండగట్టారు. ఒరిస్సాలో బిజు జనతాదళ్ స్వయం సహాయక సంఘాలకు నయా పైసా బడ్జెట్ ఇవ్వక పోయినా మహిళలకు తామే నిధులు ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకుని మహిళా ఓట్లుతో ఏవిధంగా అధికారంలోకి వచ్చిందీ వివరించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో తెలుగుదేశం, ప్రస్తుతం వైసీపి కూడా మహిళా సంఘాలను రాజకీయ సమావేశాలకు వినియోగించుకుంటున్నారని వైసీపి మరొక అడుగు ముందుకు వేసి వైసీపి కార్యక్రమాలకు హాజరుకాక పోతే బెదిరింపులకు దిగుతున్నారన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మహిళా అభ్యున్నతి క్రుషిచేస్తోంటే ప్రాంతీయ పార్టీ లు రాజకీయం చేస్తున్నాయని పురందేశ్వరి ప్రాంతీయ పార్టీలకు చురకలు అంటించారు. స్వయం సహాయక సంఘంలో ఒక్కో మహిళకు రెండులక్షలు ఆర్ధిక సహకారం అందిస్తున్న కారణంగా మహిళా భివ్రుద్ది వేగవంతం అయిందని ఇదే విషయం తాను రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తున్న సందర్భంలో స్వయం సహాయక సంఘాల సభ్యులను కలసిన సందర్భంలో చెప్పారని ఇదే అభివ్రుద్దిని నరేంద్రమోదీ కోరుకున్నారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి మహిళలకు చేస్తున్న సంక్షేమం వివరించేందుకు మహిళా మోర్చా నడుంబిగించాలని పురందేశ్వరి పిలుపునిచ్చారు.
బెల్గాం ఎమ్మెల్యే శక్తివందన్ ప్రోగ్రాం దక్షిణాది రాష్ట్రాల ఇంఛార్జి శశికళ మహిళా మోర్చానేతలకు దిశానిర్ధేశం చేశారు. మహిళా సంఘాలతో ఏవిధంగా మిళితం కావాలన్న విషయాలను వివరించారు. సమావేశానికి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ అధ్యక్షత వహించారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోమువీర్రాజు, మహిళా మోర్చా ప్రభారి, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ తదితరులు వేదికను అలంకరించారు