కేశినేని నాని… నీకు రాజకీయ బిక్ష పెట్టిన చంద్రబాబునాయుడుతో నీకు పోటీనా?

మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు ఆదివారం నాడు మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారు గత రాత్రి నందిగామ వైకాపా సమావేశంలో నాని చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ వారి కార్యాలయంలో ఒక ప్రకటనలో మాట్లాడుతూ..

అవకాశ వాద రాజకీయాలకు తెరలేపి జగన్ పంచన చేరిన కేశినేని శ్రీనివాస్ (నాని) చేస్తున్న ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోవాలి.. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ నేతలు గర్వించదగిన నేత ఆయన స్థాయి ఎక్కడ ఆయనతో మీకు పోటీనా? విజయవాడ MP బరిలో చంద్రబాబు గారు నిలబడినా, తాను 3 లక్షల మెజారిటీ తో గెలుస్తానని మాట్లాడటం ఆయన అహంకార పూరిత నైజాన్ని తేటతెల్లంగా బయటపెడుతోంది…

ప్రజలచే ఎన్నుకోబడ్డ మీరు ప్రజాస్వమ్య దేశంలో ఎలా మాట్లాడో ఎవరితో ఎలా మెలగాలో ముందు తెలుసుకోండి.. తెలుగుదేశం పార్టీ నేతలను “నువ్వెంత” అంటూ మాట్లాడే స్థాయి మీకు లేదు కేశినేని నాని.చంద్రబాబు, లోకేష్ ల కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదంటున్న నాని, మీరు గత పదేళ్లుగా MP గా ఉండి ఎన్ని సార్లు కాళ్లు పట్టుకున్నారో చెప్పాలి..

మేకపోతు గాంభీర్యం తప్ప అంతటి ప్రతిభ నాని లో లేదని, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎప్పుడో తేలిపోయింది. ఇకనైనా కేశినేని నాని స్థాయిలు గురించి మాట్లాడటం మానేసి ముందు సంస్కారంగా మాట్లాడటం నేర్చుకోవాలని అంతటి జ్ఞానాన్ని ఆ దేవుడు ఆయనకు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలియజేసారు..

Leave a Reply