రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా!

-5ఏళ్లు పట్టించుకోని వైసిపి ఇప్పుడు పట్టాలపేరుతో హడావిడి
-లోకేష్ సమక్షంలో 500కు పైగా కుటుంబాలు టిడిపిలో చేరిక

మంగళగిరి: మంగళగిరిలో ఎక్కడ అధికార వైసీపీ కనపడటం లేదు, 72 రోజుల తర్వాత రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో వైసిపి నుంచి టిడిపిలోకి వలసల పరంపర కొనసాగుతోంది. యువనేత పిలుపుతో ఊళ్లకు ఊళ్లు వైసిపిని వీడి టిడిపి తీర్థం పుచ్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం వైసిపికి చెందిన పలువురు ప్రముఖులతోపాటు 500కు పైగా కుటుంబాలు లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. వారందరికీ పసుపుకండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… 2019లో అతితక్కువ సమయం ఉండటం వల్ల మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకోలేక పోయానని చెప్పారు. అయితే 2019లో మంగళగిరిలో ఓడిపోయాక నాలో కసి పెరిగింది, ఓడిపోయినా కూడా 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరిలో అమలు చేస్తున్నాను. గత అయిదేళ్లలో వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు, ఇన్ని రోజులు పట్టించుకోని వైసిపి నాయకులు ఇప్పుడు ఇళ్లపట్టాలిస్తామని హడావిడి చేస్తున్నారు. 72రోజుల్లో రాబోయే ఎన్నికల తర్వాత మంగళగిరితోపాటు రాష్ట్రమంతా పసుపుమయం కాబోతోంది, అధికారంలోకి వచ్చాక యావత్ రాష్ట్ర ప్రజానీకం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా తాను కంటికి రెప్పలా చూసుకుంటానని లోకేష్ భరోసా ఇచ్చారు.

టిడిపిలో చేరిన వైసిపి కుటుంబాలు
పార్టీలో చేరిన వారిలో మంగళగిరి రూరల్ మండలం నవులూరు కి చెందిన మాజీ ఎంపిటిసి వైసిపి నేత షేక్ హనన్ తో పాటు 50 కుటుంబాలు, నవులూరుకి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత రుద్రు శ్రీనివాస రావు తో పాటు 10 కుటుంబాలు, చిర్రావూరు కి చెందిన వైసిపి నేత మక్కపాటి ఏసు ప్రసాద్ తో పాటు 60 కుటుంబాలు, మంగళగిరి పట్టణం 24వ వార్డు కి చెందిన వైసిపి నేత ఉజ్జురి నాగేంద్రం తో పాటు 60 కుటుంబాలు, మంగళగిరి రూరల్ ఆత్మకూరు కి చెందిన వైసిపి నేత తేలు ఫిరోజ్ నాని తో పాటు 50 కుటుంబాలు, దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు డోల శివగంట బాబు, రాయపూడి కోటేశ్వర రావు తో పాటు 10 కుటుంబాలు, ఉండవల్లి కి చెందిన 30మంది మహిళా వైసిపి కార్యకర్తలు, తాడేపల్లి టౌన్ కి చెందిన 8 వ వార్డు నుండి వైసిపి నేతలు అనుమోలు సాంబయ్య, చింతలపూడి కిలేనమ్మ తో పాటు 30 కుటుంబాలు, తాడేపల్లి టౌన్ 22, 23 వ వార్డుల నుండి వైసిపి నేతలు లాకా తిరుపతయ్య యాదవ్, లాకా కృష్ణ యాదవ్ తో పాటు 70 కుటుంబాలు, మరో 30 ముస్లిం కుటుంబాలు, తాడేపల్లి టౌన్ 10 వ వార్డు కి చెందిన వైసిపి నేత జెట్టి శివ తో పాటు 30 కుటుంబాలు, తాడేపల్లి టౌన్ 17, 20 వార్డులకు చెందిన వైసిపి నేత మహ్మద్ సలీం తో పాటు 55 కుటుంబాలు, తాడేపల్లి టౌన్ 3వ వార్డు కి చెందిన వైసిపి నేత అన్నూరి జార్జ్, వనమా దిలీప్, ఇసుకపల్లి శ్రీను, మేడికొండ సంతోష్, అన్నూరి వివేక్ తో పాటు 30 కుటుంబాలు, తాడేపల్లి టౌన్ 12 వ వార్డుకి చెందిన వైసిపి నేత రెడ్డి నిర్మల, బాజి తో పాటు 30 కుటుంబాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త నందం అబద్దయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply