ఎమ్మెల్యే గొట్టిపాటి కంపెనీకి సుప్రీంలో రిలీఫ్

ఏపీ షోకాజ్ నోటీసుపై సుప్రీం స్టే
టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు సుప్రీంలో ఊరట లభించింది. గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ కంపెనీ మూసివేతకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం స్టే విధించింది. గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. రూ.50 కోట్ల జరిమానాకు సిఫారసు చేసింది. ఏపీ ప్రభుత్వ షోకాజ్ నోటీసును హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. డివిజన్ బెంచ్ ఆదేశాలను సుప్రీంలో ఎమ్మెల్యే గొట్టిపాటి సవాలు చేశారు. గ్రానైట్ కంపెనీలలో అవకతవకలపై విజిలెన్స్ సిఫారసులు చట్ట విరుద్ధమని ఎమ్మెల్యే గొట్టిపాటి తరపు న్యాయవాదులు వాదించారు. ఏపీ ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై సుప్రీం ధర్మాసనం స్టే విధించింది.