– 1978 పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
యడ్లపాడు: ఓ 15 ఏళ్ల వయసులో విడిపోయి 60 ఏళ్ల వయసులో కలుసుకున్న 50 మంది విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చిన్ననాటి గుర్తుల ప్రస్తావనలతో అత్యద్భుతంగా జరిగింది. పల్నాడు జిల్లా లోని మండల కేంద్రం అయిన యడ్లపాడు లోని లూధరన్ హైస్కూల్లోని 1978 వ సంవత్సరం బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పూర్వ విద్యార్థిని వేగేశ్న అనురాధ అధ్యక్షతన జరిగింది. వివిధ హోదాలలో ఉన్న పలువురు విద్యార్థులు తమ హోదాలు మరిచి చిన్నప్పటి వలె అరె, ఒరే, అంటూ ఒకరినొకరు ఉదయం నుంచి రాత్రి వరకు ఆత్మీయంగా పలకరించుకున్నారు.
ఎక్కడికక్కడ గుంపులుగా ఏర్పడి చిన్నప్పటి ముచ్చట్లు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది జోసెఫ్ మాస్టారు, రైటర్ సోమరాజు హనుమంతరావు లను విద్యార్థులు సన్మానించారు. కొందరు పాద పూజ చేశారు. అత్యంత భక్తితో, మేళతాళాల నడుమ విద్యార్థులు జరిపిన సన్మానం ఉపాధ్యాయులకు ఎంతో సంతోషం కలిగించింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు నిమ్మరాజు చలపతిరావు, ఎడ్ల సునీల్, వై వి రమేష్ బాబు లకు పాఠశాల విద్యార్థులు సన్మానం చేశారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయిని పద్మలత, యడ్లపాడు ఎంఈఓ,లకు సన్మానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షుడు ఆలోకం పెద అబ్బయ్య , కమిటీ సభ్యులు చల్లా యజ్ఞేశ్వర రెడ్డి, నూతలపాటి కాళిదాసు, ముత్తవరపు రామారావు, పోపూరి వెంకట రత్తయ్య లకు పూర్వ విద్యార్థులు సన్మానం జరిపారు.
ఈ కార్యక్రమాన్ని ఆలోకం హరి బాబు, యడ్లపాటి వెంకట రమణ మూర్తి, పుసులురి రంగాచారి, బాపట్ల వెంకట నారాయణ, మైదవోలు హనుమంతరావు, కేశన ముత్యాల రెడ్డి , భాగ్య ప్రకాశ మని, పోపురి పుణ్య కుమారి నిర్వహించారు. ఇన్నేళ్ల తర్వాత ఇలా కలుసుకోవాలని చేసిన పూర్వ విద్యార్థుల కృషిని పలువురు వక్తలు కొనియాడారు. ఇలాగే విద్యార్థులు ఐకమత్యంగా ప్రతి ఏడాది జరుపుకోవాలని కోరారు.