– గజ్జెల కాంతం ను చీరి చింతకు కట్టే శక్తి మాకుంది
– నక్సల్ ఉద్యమం లో పోలీసులకు కోవర్టు కాంతం
– బీ ఆర్ ఎస్ యువజన విభాగం నేత వలమల్ల కృష్ణ
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ ను బూతుల భవన్ గా మార్చారు. గాంధీ భవన్ లో కేసీఆర్ ,కే టీ ఆర్ లపై నేతలు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. గజ్జెల కాంతం కే టీ ఆర్ పై వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి పై తారా చౌదరీ ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. అలాంటి రేవంత్ రెడ్డి కింద పని చేస్తూ కాంతం అనవసర ప్రేలాపనలు చేస్తున్నారు. గజ్జెల కాంతం ను చీరి చింతకు కట్టే శక్తి మాకుంది. పిచ్చి ప్రేలాపనలు మానక పోతే తగిన శాస్తి చేస్తాం. కాంతం ది అంతా బ్లాక్ మెయిల్ చరిత్రే
పోలీసు కోవర్టు కాంతం: బీ ఆర్ ఎస్ యువ నేత మంద సురేష్
గజ్జెల కాంతం నక్సల్ ఉద్యమం లో పోలీసులకు కోవర్టు గా మారి ఎంతో మందిని పొట్టన బెట్టుకున్నాడు. గజ్జెల కాంతం ది నీచ చరిత్ర. ఐకాన్ కే టీ ఆర్ ను తిడితే తానొక పెద్ద నేతను అవుతా అని కాంతం అనుకుంటున్నారు. పచ్చి తాగుబోతు తాగి మా నేతలపై విమర్శలు చేస్తున్నారు. రేవంత్ ఎంగిలి మెతుకులకు ఆశపడి గజ్జెల కాంతం పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు.
కాంతంకు తగిన శాస్తి చేస్తాం: బండారి వీరబాబు
గజ్జెల కాంతం కరీంనగర్ లో పాల్పడ్డ అరాచకాల జాబితా అప్పట్లో ఎస్పీ గా పని చేసిన ప్రవీణ్ సార్ దగ్గర ఉంది. సరైన సమయం లో ఆ చిట్టా బయటపెడతాం. గజ్జల కాంతం ఆధారాలు లేకుండా అసభ్య విమర్శలు చేస్తే సహించేది లేదు. రేవంత్ రెడ్డి కి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ దొరకడం లేదు .అలాంటి రేవంత్ కోసం కే టీ ఆర్ పై విమర్శలు చేస్తున్నాడు. గజ్జెల కాంతం తన వైఖరి మార్చుకోకపోతే తగిన విధంగా స్పందిస్తాం.