Suryaa.co.in

Telangana

రైతుల జీవితాలతో రేవంత్ సర్కారు చెలగాటం

442 మంది రైతులు చనిపోయారు
– ఫసల్ బీమాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి

హైదరాబాద్: ఎద్దేడిస్తే రైతులు ఎంతగా బాధపడతారో మనకు తెలుసు. రైతు ఏడిస్తే మన తెలంగాణ రాష్ట్రం కూడా బాధపడుతుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల దుస్థితిపై పట్టించుకోలేదు. ఈనాడు సుమారు 30 లక్షల టన్నులు వరిధాన్యం తడిసి పోయింది. ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

మహబూబ్నగర్ జిల్లాలో 51 ఏళ్ల గుగ్గులోత్ కిషన్, సూర్యపేట అన్నారం గ్రామంలో రైతు ఉప్పల వెంకన్న, జనగాం వెల్దీ గ్రామంలో యాదగిరి వంటి రైతులు నష్టాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 442 మంది రైతులు చనిపోయారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి పంటకు 2320 రూపాయల ఎంఆర్పీ అందిస్తోంది. పంట కొనుగోలు ఖర్చు అంతా కేంద్రమే భరిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అధికారులకు పని కల్పించకుండా, పంట కొనుగోలు సరిగ్గా జరపకుండా రైతులను ఇబ్బందిపెడుతోంది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ఇస్తూ, 10 రకాల పంటలకు బోనస్ ఇస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫసల్ బీమాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు, రైతులను మోసం చేస్తున్నారు.

ఫసల్ బీమా కింద కేంద్రం ఇన్సూరెన్స్ ద్వారా రైతులకు నష్టం భరించేందుకు సిద్ధంగా ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలు చేయడం లేదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సౌర విద్యుత్ వ్యవస్థలు, 24 గంటల కరెంట్, నీరు అందిస్తున్నారు, కానీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కల్పించడం లేదు. మాన్సూన్ ముందస్తు హెచ్చరికలు వచ్చినా cropping ప్లానింగ్ చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన ఆలోచన లేదు.

రుణమాఫీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మాటలు చెప్పినా, ఎంత మందికి పూర్తిగా ఎంత రుణమాఫీ చేశారో చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులకు తీసుకున్న లోన్లపై వడ్డీ, చక్రవడ్డీ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు, మళ్లీ లోన్ దొరకడం లేదు. రైతు బంధు, రైతు కూలీలకు వాగ్దానం చేసినట్లుగా నగదు ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వలేదు? డబ్బులు లేవని చెబుతూ హామీలు, పథకాలు అమలు చేయకపోవడం సిగ్గుచేటు.

కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక ఏవీ అమలు చేయకుండా రైతులను, మహిళలను, విద్యార్థులను, యువకులను మోసం చేసింది. ప్రతి క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తానన్న డిక్లరేషన్ కూడా అమలు చేయలేదు. రైతులు పండించిన ప్రతి పంట కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు ఇస్తోంది.

సుతిలి, సంచి, కాంటాకు, హమాలికి, ట్రాన్స్‌పోర్టేషన్, బ్యాంకులో మూడు నెలల కాలం వడ్డీ సహా అవసరమైన అన్ని డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 30 లక్షల టన్నుల ధాన్యం కొనకపోవడం, రైతుల జీవితాలతో చెలగాటం చేస్తోంది.

పీఎం కుసుమ్ పథకం క్రింద 4000 మెగావాట్ల సౌరశక్తి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 30-40%, రాష్ట్ర ప్రభుత్వం 30% సబ్సిడీ ఇవ్వాలి. కానీ దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోంది.

LEAVE A RESPONSE