పేపర్ లీక్ కు ఆద్యుడు రేవంత్ రెడ్డి

3

-నిరుద్యోగుల వ్యతిరేకి రేవంత్ రెడ్డి
-యూనివర్సిటీకి వస్తే నిన్ను అడ్డుకొని తీరుతాం రేవంత్ రెడ్డి
-పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ పై ప్రభుత్వం మీద నిరారోపణమైన ఆరోపణలు రేవంత్ రెడ్డి చేయడం దుర్మార్గం
– పేపర్ లీకేజీలు రేవంత్ రెడ్డి పాత్ర ఉంది అందుకే సిట్ విచారణ జరగకుండా నిందితుడు రాజశేఖర్ రెడ్డి భార్యతో కోర్టులో కేసు వేయించాడు రేవంత్ రెడ్డి
బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ఆవరణంలో విద్యార్థి సంఘాల మీడియా సమావేశం

కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగ వ్యతిరేక నాయకులు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా కుట్ర చేస్తున్నారు.బిజెపి , కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో పేపర్లు లీకేజీలు అయితే అక్కడ మంత్రులుగాని ముఖ్యమంత్రి గాని రాజీనామా చేశారా…? గుజరాత్ లో తాజాగా పంచాయత్ శాఖ పోస్టుల పరిధిలో పేపర్ లీకేజీలో ఎందుకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గాని ముఖ్యమంత్రి భూపెంద్ర పాటిల్ గాని రాజీనామా చేయలేదు…?ఉత్తరప్రదేశ్ పేపర్ లీక్ అయితే ఎందుకు అరాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనత్ ఎందుకు రాజీనామా చేయలేదు….? రాజస్థాన్ సీఎం టీచర్ కుంభకోణాల్లో ఎందుకు రాజీనామా చేయలేదు ?

రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు బిజెపికి వంతపడుతూ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం లేదు? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై మాట్లాడటం లేదు? ఇద్దరు తొత్తులుగా మారి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో బిజెపి కాంగ్రెస్. లోపాయిరికాగా ములఖత్ అయినవి. ఆధారాలు లేకుండా మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే పిసిసి అధ్యక్షుడికి , ఎంపీ పదవికి రాజీనామా చేయాలి.ప్రజలారా కాంగ్రెస్ బిజెపి నాయకుల ఆరోపణలు తిప్పికొట్టండి.

ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగు పెట్టే కనీస అర్హత కూడా లేదు.ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే తన్ని తరుముతాం రేవంత్ రెడ్డిని.కనీస అవగాహన లేకుండా బండి సంజయ్, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మంత్రి కేటీఆర్ పై ప్రభుత్వం పై ఆరోపణ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి.నిజాలను తప్పించేందుకు అనవసర ఆరోపణలు చేస్తున్నారు.కాంగ్రెస్ విద్యార్థి నాయకులై గతంలో రేవంత్ రెడ్డి మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆయన ఆయనకు సిగ్గులేదు రేవంత్ రెడ్డి దొంగ. ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉంది.. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బిజెపి పార్టీకి ఏజెంట్గా పని చేస్తున్నావు.

ఈ కార్యక్రమంలో మందల భాస్కర్ , వీరబాబు, తొట్ల స్వామి , తుంగ బాలు , కడారి స్వామి, కిరణ్ గౌడ్ , రఘురాం, హరిబాబు, శిగా వెంకట్, చటారి దశరథ్, నవీన్ గౌడ్ , కృష్ణ , రమేష్ గౌడ్ , నాగేందర్ రావు , అవినాష్ , వివిధ సంఘాల విద్యార్థి నాయకులు మరియు బిఆర్ఎస్వి నాయకులు అందరు పాల్గొన్నారు.