-రిజర్వేషన్ల అంశంలో బీజేపీపై విషప్రచారం
-కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతోంది
-సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి సవాల్
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. రిజర్వేషన్లు తొలగిస్తామని, రద్దు చేస్తామని తమపై దుష్ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటే అని ప్రచారం చేశారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఈ దశాబ్దపు అతి పెద్ద అబద్ధమని వ్యాఖ్యానించారు. మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీలకు గండి కొట్టింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి బీసీల రిజర్వేషన్లపై బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతుంది…దానిని తట్టుకోలేక విష ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారని అన్నారు. ఏ ప్రాతిపదికన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారో చర్చకు రావాలని సవాల్ చేశారు.