Home » ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత సంచారం

ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత సంచారం

శంషాబాద్‌: శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్‌ పోర్ట్‌ ప్రహరీ నుంచి ఓ చిరుత దూకింది. చిరుతతో పాటు దాని రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఎయిర్‌ పోర్ట్‌ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్‌ వైర్లకు తగలడంతో ఎయిర్‌ పోర్ట్‌ కంట్రోల్‌ రూమ్‌లో అలారం మోగింది. అప్రమత్తమైన కంట్రోల్‌ రూమ్‌ సెక్యూరిటీ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు తేలింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు సమాచారం. దాంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎయిర్‌ పోర్టులోకి చేరుకున్న వారు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుత కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు.

Leave a Reply