మోటార్లకు మీటర్లు పెడితే నేనే బాధ్యత వహిస్తా

-లేనిపక్షంలో ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే
-కేసీఆర్… మీ కుటుంబ అవినీతికే మీటర్లు పెట్టినం… మీ సంగతి చూస్తాం
-వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయ ‌సన్యాసం
-నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు కేసీఆర్ సిద్ధమా?
-రూ.60 వేల కోట్ల బకాయిలతో డిస్కంలను సంక్షోభంలోకి నెట్టిన సీఎం
-కరెంట్ ఛార్జీల పెంపుతో జనం నడ్డి విరుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం
-చైనా బజార్లలో చైనా సరుకులున్నాయనడం పెద్ద జోక్…
-మైసూర్ పాక్, మైసూర్ బజ్జీ, ఇరానీ చాయ్… అక్కడి నుండే వస్తున్నాయా?
-మేకిన్ ఇండియా పేరుతో స్థానిక పరిశ్రమల నుండే చైనా బజార్లకు వస్తువులు
-ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోతే ఉరేసుకుంటానన్న ఎమ్మెల్యే ఎటుపోయిండు?
-250 కోట్లతో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు డబ్బులివ్వరా?
లక్షకోట్లతో దొంగ సారా దందా చేస్తారా?
-కేసీఆర్…. మీవల్ల కాకపోతే చేతగాదని రాసివ్వండి
-కేంద్రాన్ని ఒప్పించి రూ.250 కోట్లతో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం
-గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తానన్నహామీ ఏమైంది?
-గల్ఫ్ బాధితుల శవాలను కూడా తీసుకురాలేని అసమర్థులు
ఎములాడ రాజన్న, బాసర సరస్వతి ఆలయాలకు వందల కోట్ల మంజూరు హామీ ఏమైంది?
-మళ్లీ కొండగట్టు అంజన్న పేరుతో దేవుళ్లకే శఠగొపం పెడతున్న కేసీఆర్
-సోమన్నగుట్టకు ఘాట్ రోడ్డు వేయడం చేతగాని సీఎం
-ఈ మండలంలో 2 గ్రామాల దత్తత తీసుకుంటానన్న ఎమ్మెల్యే హామీ ఏమైంది?
-బీడీ కార్మికుల బాధలెందుకు పట్టించుకోవు…పెన్షన్లకు కటాఫ్ డేట్ ఎత్తేయాల్సిందే…
-గ్రామ పంచాయతీల అభివ్రుద్ధి కోసం ఖర్చు చేస్తున్న నిధులన్నీ కేంద్రానివే
-మొగిలిపేట ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ కుమార్

కరెంట్ మోటార్లకు కేంద్రం మీటర్లను ఏర్పాటు చేయబోతోందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ‘‘కేసీఆర్…. రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం లేకుండా మోటార్లకు మీటర్లు పెట్టడం అసాధ్యం. కేంద్రం చేసిన కొత్త చట్టంలో కూడా మీటర్లకు మోటార్లను ఏర్పాటు చేయాలనే ఊసే లేదు. నేను సవాల్ చేస్తున్నా… మోటార్లకు కేంద్రం మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ మీటర్లు పెడితే దానికి పూర్తి బాధ్యత తీసుకుంటా… మీటర్లు పెట్టకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతావా?’’ అంటూ సవాల్ విసిరారు.

అవినీతిలో మునిగిపోయిన కేసీఆర్ కుటుంబానికే కేంద్రం మీటర్ పెట్టిందని…. అలాంటి అవినీతి పరులను బజారు కీడ్చి అంతుచూసేందుకు మోదీ సర్కార్ చర్యలు ప్రారంభించిందన్నారు. లక్ష కోట్లతో దొంగ సారా దందా చేస్తున్న కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేయడం ఖాయమన్నారు. లక్ష కోట్లతో దొంగ దందాలు చేస్తున్న కేసీఆర్ కుటుంబానికి ముత్యం పేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు రూ.250 కోట్లు కేటాయించేందుకు డబ్బుల్లేవనడం సిగ్గుచేటన్నారు.

‘‘కేసీఆర్… ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం నాకు చేతగాదని లేఖ రాసివ్వు. కేంద్రాన్ని ఒప్పించి రూ.250 కోట్లతో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత నేను తీసుకుంటా’’అని స్పష్టం చేశారు. చైనా బజార్లలో వస్తువులన్నీ చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నామని కేసీఆర్ చెప్పడం సిగ్గు చేటన్నారు. ‘‘ కేసీఆర్ చెప్పింది ఎట్లుందంటే…. మైసూర్ పాక్, మైసూర్ బజ్జీలు… మైసూర్ నుండే తీసుకొస్తున్నట్లుగా ఉంది. ఇరానీ చాయ్… ఇరానీ నుండి తీసుకొస్తున్నట్లుగా ఉంది… సిగ్గుండాలే అబద్దాలాడటానికి. మోదీ ప్రభుత్వం తీసుకున్న మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా వేలాది పరిశ్రమలు వస్తున్నయ్. ఆయా స్థానిక పరిశ్రమల్లో తయారైన వస్తువులనే చైనా బజార్లలో అమ్ముతున్నారు. ఆ సోయి కూడా లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడు’’అని విమర్శించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించడంతోపాటు ఇల్లులేని పేదలందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తుంది. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తాం. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మెగిలిపేట గ్రామంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయా అంశాలపై స్పందించారు. అంతకుముందు ఉదయం పాదయాత్ర శిబిరం మెగిలిపేట, ముత్యంపేట రైతులతో జరిగిన సమావేశంలోనూ బండి సంజయ్ ఆయా అంశాలను ప్రస్తావించారు.

Leave a Reply