– అందుకే మార్చురీకి పంపిస్తామన్నారు
– హత్య చేస్తేనేనే కదా మార్చురీకి పంపేది?
– రేవంత్ మాటల వెనుక కుట్ర కోణం
– సీఎంపై చర్య తీసుకోండి
– పోలీసులకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాక్టర్ దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
– రేవంత్ రెడ్డి అరాచక పాలన
– రాహుల్ గాంధీకి ఇది కనిపించలేదా?
– కేసీఆర్ పై చేసిన హేయమైన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలి
– ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్
హైదరాబాద్: రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నేరపూరిత, హేయమైన, అశ్లీల వ్యాఖ్యలను తక్షణమే ఖండిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో రేవంత్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం, డా. దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి చేసిన “మీకు మీరూ, మాకు స్టేచర్ ఉందని అనుకుంటే, స్ట్రెచర్ మీదకి పంపించిండ్రు… ఇట్లనే చేస్తే, ఆ తర్వాత మార్చురీకి పోతారు…” అనే వ్యాఖ్యల వెనుక తీవ్ర కుట్ర దాగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఓ ఎమ్మెల్యే తో కలిసి రేవంత్ రెడ్డి హత్యా కుట్ర చేస్తున్నాడా? కేసీఆర్ పై శారీరకంగా హాని చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? ఎవరైనా హత్యకు గురైనపుడే మృతదేహం మార్చురీకి వెళ్తుంది. కేసీఆర్ శరీరం మార్చురీకి ఎలా వెళ్తుంది? మీ అబద్ధపు హామీలను ప్రశ్నించినందుకా? ప్రజలను మోసం చేసినందుకా?
రేవంత్ రెడ్డి పిచ్చిపట్టినట్టు వాగుతుండు – పోలీసులు ఎందుకు మౌనం?
రేవంత్ రెడ్డి “మార్చురీ” అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా వాడటం, కేసీఆర్ గారి ప్రాణాలకు ప్రమాదం ఉందని సూచించే సంకేతంగా ఉంది. ఇది నేరపూరిత బెదిరింపు మాత్రమే కాదు, రాష్ట్రంలో అశాంతిని, ప్రజల్లో భయాందోళనను పెంచే కుట్రపూరిత చర్య.
“ఓ రాజ్యాంగ బద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, ప్రజాస్వామ్యంలో ఓ ప్రముఖ నాయకుడిని చంపేస్తామని బహిరంగంగా హెచ్చరిస్తే, అది ప్రభుత్వమే హత్యా కుట్ర చేస్తోందన్న అర్థం కాదు?” అని డా. శ్రవణ్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి అణగదొక్కే భాషపై ఎందుకు నిశ్శబ్దం?
“రాహుల్ గాంధీ ఎప్పుడూ ‘నఫ్రత్ కే బజార్ మే మోహబ్బత్ కా దుకాన్’ అని మాట్లాడుతాడు. అదే రేవంత్ రెడ్డి మాత్రం బిన్నంగా వ్యవరిస్తాను.“కేసీఆర్ పై ఇలా మాట్లాడటానికి AICC అనుమతి ఇచ్చిందా? రాహుల్ గాంధీకి ఇది కనిపించలేదా? లేక రేవంత్ రెడ్డి భరతం పట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం భయపడుతోందా?”
ఒక ముఖ్యమంత్రి మాటలకే అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడితే, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతటి అవమానం? భారత రాజ్యాంగానికి, IPC కి, BNSS కి రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నాడు! రేవంత్ రెడ్డి చేసిన ఈ నేరపూరిత వ్యాఖ్యలు భారత శిక్షాస్మృతి (IPC), భారత న్యాయ సంహిత (BNSS), భారత రాజ్యాంగంలోని అనేక నిబంధనలను ఉల్లంఘిస్తాయి. నేరపూరిత బెదిరింపు (IPC సెక్షన్ 506, BNSS సెక్షన్ 352) – కేసీఆర్ ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యాఖ్యలు చేయడం 7 ఏళ్ల జైలు శిక్షకు అర్హం.
ప్రజా దుష్ప్రచారం (IPC 505, BNSS 318) – రాష్ట్రంలో అస్థిరత, భయం, భద్రతా లోపాన్ని పెంచేలా ప్రవర్తించడం 3 ఏళ్ల జైలు శిక్షకు అర్హం. రెచ్చగొట్టే ప్రకటనలు (IPC 504, BNSS 316) – 2 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా.
“రేవంత్ రెడ్డి మాటలు చిన్నవి కాదు, ఇవి ప్రణాళికాబద్ధమైన కుట్రలు!” “ఇలా అహంకారంతో విర్రవీగిన వాళ్లు చరిత్రలో ఎప్పుడూ నాశనమయ్యారు. ఈ విష ప్రచారాన్ని కొనసాగిస్తే ప్రజలు రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారు.”
ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేష్, రాష్ట్ర నాయకులు డా. కురువ విజయ్ కుమార్, తోట్ల స్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు నమోదైంది.
రేవంత్ రెడ్డి పై తక్షణమే IPC & BNSS సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. రేవంత్ రెడ్డిని విచారణకు పిలిచి, ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న కుట్రను బయటపెట్టాలి. కేసీఆర్భద్రతను పెంచాలి, ప్రభుత్వ హత్యా కుట్రలకు నిరోధక చర్యలు తీసుకోవాలి.
ఈ అరాచక ముఖ్యమంత్రిని నియంత్రించకపోతే, రేపు తెలంగాణలో ఏదైనా ప్రమాదం జరిగినా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది!” అని డా. దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.