పొన్నూరు పట్టణంలో పేదవాడి బియ్యానికి మారు బేరగాళ్ళు ఎక్కువయ్యారు. అక్రమ వ్యాపారాన్ని అనువుగా మార్చుకొని, నిత్యం బియ్యాన్ని అక్రమ వ్యాపారుల మిల్లులకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. ద్విచక్ర వాహనం పై కొందరు వ్యక్తులు రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి నేరుగా మిల్లర్లకు విక్రయిస్తున్నారు. కొందరు రేషన్ డీలర్లు కూడా వినియోగదారులకు బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చి తమ శక్తి వంచన లేకుండా మిల్లర్లకు సహకరిస్తున్నారు.పట్టణంలో యమ్.యస్.ఆర్. రైస్ మిల్ ఈ దందాకు అడ్డాగా నిలుస్తుంది. నల్లబజారుగా మారి మారు బేరగాళ్లకు వేదిక అవుతుంది.
ఈ మిల్లు నందు కొద్ది రోజుల క్రీతం బారి ఏత్తున రేషన్ బియ్యం పట్టుబడినా మిల్లు యాజమాన్యం ఏమాత్రం తొణికిసలాడటంలేదు. ఇది మాకు కొత్తేమీ కాదంటూ రీ ప్యాక్ చేసిన రెండు లారీల రేషన్ బియ్యపు బస్తాలను లారీలోకి లోడ్ చేస్తుండగా విజిలెన్స్ అధికారులు గుర్తించి బుధవారం రాత్రి వాటిని
పట్టుకొని సీజ్ చేశారు. నిస్సిగ్గుగా వ్యాపారం సాగిస్తూ చిన్న కాశీగా పేరున్న పొన్నూరు పట్టణాన్ని రేషన్ బియ్యాల అక్రమ రవాణాకు అడ్డగా మారుస్తున్నారు. ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ అధికారులు వెంట వెంటనే స్పందించి ఈ అక్రమ దందాకు కళ్లెం వేయాలని, ప్రభుత్వం కూడా ఈ అంశాలపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.