Home » స్వల్ప మార్పులతో దుర్గమ్మ తెప్పోత్సవం

స్వల్ప మార్పులతో దుర్గమ్మ తెప్పోత్సవం

విజయవాడ: ప్రకాశం బ్యారేజీలో వరద ఎక్కువగా ఉన్నందున స్వల్ప మార్పులతో కనకదుర్గ అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై కలెక్టర్ జె.నివాస్ సమక్షంలో దసరా కో ఆర్డినేషన్ సమావేశం జరిగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నదిలో విహారం లేకుండా దుర్గా మళ్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెప్పోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం కృష్ణానదిలో దుర్గా మళ్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు యథాతథంగా పూజలు నిర్వహిస్తామన్నారు. పరిమిత సంఖ్యలో అర్చకులతో నదిలో దుర్గమ్మ, స్వామివార్ల ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహిస్తామని కలెక్టర్ జె.నివాస్ వెల్లడించారు.

Leave a Reply