కొల్కతా మహిళ టాటూ వెనక దాగిన దశాబ్దాల ఇమ్యూనాలజీ పోరాటం
టాటూ నుంచి ట్రిగ్గర్స్ వరకూ: అలెర్జీల కొత్త పరిణామాలు
కొల్‌కతాకు చెందిన 20 ఏళ్ల యువతి దాదాపు పదేళ్లుగా విభిన్నమైన అలెర్జీ సమస్యలతో బాధపడుతోంది – దద్దుర్లు, పొడి దగ్గు, శరీరం మొత్తం ఇచ్చింగ్, కళ్ళ దురద, మలబద్ధకం.
చాలామందిని సంప్రదించినా, లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స జరిగింది. కానీ అసలు మూలకారణం మాత్రం ఎవరికీ స్పష్టంగా తెలియలేదు. చివరకు ఆమె హైదరాబాద్‌లోని అశ్విని అలెర్జీ సెంటర్‌ను సంప్రదించింది.
ఆమెకు అలర్జీ లక్షణాలు కొత్త కాదు – 5 సంవత్సరాల క్రితం వేసుకున్న చేతి టాటూ. ప్రతిసారి అలెర్జీలు పెరిగినప్పుడు అదే టాటూ దగ్గరే ముందుగా ఎర్రబారటం, దురద రావడం ప్రారంభమయ్యేది.
“ఆమె చేతివైపు చూపించి ‘ఎప్పుడూ ఇక్కడే మొదలవుతుంది’ అన్న మాటే, మాకు క్లినికల్ టర్నింగ్ పాయింట్ అయింది,” అంటారు డా. వ్యాకరణం నాగేశ్వర్.
ఫ్యామిలీ హిస్టరీ చర్మంపై రాసిన గాథ
ఆమె తల్లికి కూడా క్రానిక్ అలెర్జిక్ ఉర్టికేరియా(Urticaria )మచ్చల రూపంలో వచ్చే అలెర్జీ దద్దుర్లు ఉండేది. దీని వలన కుటుంబంలోనే అలెర్జీ హిస్టరీ ఉన్నట్టు స్పష్టమైంది.
“అలెర్జిక్ అర్టికేరియా, అలెర్జిక్ రైనిటిస్, సైనసైటిస్, ఆస్థమా లేదా ఎక్జిమా తల్లిదండ్రుల్లో ఉంటే – పిల్లల్లో సహజంగానే ఎక్కువ ఇమ్యూన్ ప్రతిస్పందన ( హైపర్ రియాక్టివిటీ) కనిపిస్తుంది,” అని డా. నాగేశ్వర్ వివరించారు.
దీని వలననే ఈ యువతిలో చిన్న వయస్సులోనే తీవ్ర అలెర్జీ లక్షణాలు ప్రారంభమయ్యాయని, అధిక హిస్టమిన్ స్పందన మరియు సీరమ్ IgE స్థాయిలు కూడా ఈ కారణం వల్లేనని ఎక్కువని తేలింది.
నిర్ధారణ: స్కిన్ టెస్ట్ + సీరమ్ IgE
సీరమ్ IgE ఫలితం
రోగిలో: 880 IU/mL
సాధారణం: <100–150 IU/mL
5–8 రెట్లు ఎక్కువ. ఇది స్పష్టంగా సిస్టమిక్ అటోపీ (జెనెటిక్ అలెర్జీ ప్రిస్పోజిషన్) అని నిర్ధారించింది.
ఈ యువతి కి అలర్జీ టెస్ట్ నిర్వహించడం జరిగింది.
గుర్తించిన ప్రధాన ఫుడ్ అలెర్జెన్స్
బంగాళదుంప
చాక్లెట్
పల్లీలు
గోధుమ
నువ్వులు
“ఈ ఆహార అలెర్జెన్స్ ముఖ్యంగా( GUT IMMUNITY)గట్ ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయి. వీటిని తరచుగా తింటే రక్తంలో హిస్టమిన్(HISTAMINE)మరింత పెరిగి అలెర్జీ బాధలు మరింత పెరుగుతాయి,” అని డా. నాగేశ్వర్ తెలిపారు.
గుర్తించిన పర్యావరణ అలెర్జెన్స్
గినాండ్రోప్సిస్ జైనాండ్రా
సైనోడాన్ డాక్టిలోన్ (బెర్ముడా గడ్డి)
ఆర్జిమోన్ మెక్సికానా
దోమల అలెర్జెన్
రైజోపస్ నైగ్రికాన్స్ (ఫంగస్)
లాటెక్స్: 6 (బలమైన పాజిటివ్)
కానోకార్పస్ పరాగకణం: 2
పావురాల మల: 1
పావురాల ఈకలు: 1
ఇది పాలీ-సెన్సిటైజేషన్ (ఒకేసారి అనేక అలెర్జీలకు స్పందన) అని నిర్ధారించింది.
టాటూ – చర్మం గట్టిగా మాట్లాడే స్థలం
ప్రతి అలెర్జీ ఫ్లేర్-అప్‌లో టాటూ దగ్గరే మొదట దురద- దద్దుర్లు రావడం యాదృచ్ఛికం కాదు. ముఖ్యంగా నలుపు, ఎరుపు ఇంక్ రసాయనాలు చర్మానికి దీర్ఘకాలిక యాంటిజెన్లలా పనిచేస్తాయి.కొంతకాలానికి ఈ యాంటిజెంట్స్ వల్లనే శరీరంలో ఎలర్జీ అవుతుంది.
“టాటూ ఇంక్ ఒక ఇర్రిటెంట్ కెమికల్. కానీ చాలా దేశాల్లో ఇది సరిగా నియంత్రణలో లేదు. అలెర్జీ హైపర్ సెన్సిటివ్ ఉన్న వ్యక్తుల్లో ఇది ఇమ్యూన్ మెమరీ జోన్లా మారుతుంది,” అంటారు డా. నాగేశ్వర్.
“సీరమ్ IgE ఎక్కువగా ఉన్న రోగుల్లో, అలెర్జీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారిలో – టాటూ చర్మం నిజంగా ఇమ్యూన్ అలారం సిస్టమ్‌లా మారుతుంది.”
చికిత్సా ప్రణాళిక – అశ్విని అలెర్జీ సెంటర్లో
1. అలెర్జెన్ అవాయిడెన్స్ – ఆహారం, వాతావరణం ఆధారంగా తప్పించుకోవాల్సినవి.
2. ఇమ్యూనోథెరపీ –
సబ్లింగ్వల్ అలెర్జెన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ (SLIT).
పర్యావరణ అలెర్జెన్స్పై ఇమ్యూనోథెరపీ.
3. టాపికల్ యాంటీహిస్టమిన్
4. టాపికల్ విటమిన్ D అప్లికేషన్
5. నాన్-సెడేటింగ్ యాంటీహిస్టమిన్
ఈ కేసు మాకు నేర్పింది ఏమిటి?
అలెర్జీలు చాలా సార్లు కుటుంబపరమైన వారసత్వం. సీరమ్ IgE, ఫ్యామిలీ హిస్టరీ – జీవితాంతం అలెర్జీ ప్రిస్పోజిషన్ను సూచిస్తాయి. టాటూ వేసిన చర్మం అలెర్జీ ఫ్లేర్-అప్ స్పాట్‌గా మారవచ్చు.
అలెర్జీ ఉన్నవారు టాటూ వేయించుకోవడం లో తొందరపడకూడదు – ఇది మరింత తీవ్రమైన అలెర్జీ సమస్యలు తెచ్చే అవకాశం ఉంది.
పబ్లిక్ హెల్త్ రిమైండర్
“హఠాత్తుగా అలెర్జీ లక్షణాలు – వాపు, దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది – మొదలైతే ఆలస్యం చేయకండి. వెంటనే దగ్గర్లోని ఎమర్జెన్సీ యూనిట్‌కి వెళ్లండి. అలెర్జీలు వేగంగా ప్రాణాపాయ స్థితికి చేరవచ్చు. తక్షణ వైద్య చర్య ప్రాణాలను కాపాడుతుంది,” అని డా. నాగేశ్వర్ సూచిస్తున్నారు.
– డా. వ్యాకరణం నాగేశ్వర్
పల్మనాలజిస్ట్, అలెర్జిస్ట్ & ఇమ్యూనాలజిస్ట్
అశ్విని అలెర్జీ సెంటర్, హైదరాబాద్
www.aswiniallergycentre.com
ప్రెసిడెంట్: వరల్డ్ అలెర్జీ ఫౌండేషన్