Suryaa.co.in

Andhra Pradesh

రూ.1020కోట్ల ఉపాధిహామీ సొమ్ముని వైసీపీ నేతలు పందికొక్కుల్లా బొక్కేశారు

– జగన్ ప్రభుత్వం పేదలకు చెల్లించాల్సిన ఉపాధిహామీ నిధులను కూడా స్వాహాచేస్తోంది
– మస్టర్ల మాయాజాలంతో 21కోట్ల పనిదినాల ఉపాధిహామీ సొమ్ము, వైసీపీవాళ్ల పరమైంది
– దిగమింగిన ఉపాధినిధులను కేంద్రప్రభుత్వం, జగన్ సర్కారు నుంచే ముక్కుపిండి వసూలు చేయాలి.
– మాజీ శాసనసభ్యులు కూన రవికుమార్
రాష్ట్రంలో పేదలపరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఉపాధిలేక ఉపాధి కూలీపనికి వెళ్లినవారికి కూడా ఈప్రభుత్వం డబ్బులివ్వడంలేదని, చెవిటి, గుడ్డి ప్రభుత్వమైన వైసీపీప్రభుత్వం, ఉపాధికూలీపనివాళ్లు వేస్తున్న ఆకలికేకలు వింటూ ఆనందిస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసన సభ్యులు కూనరవికుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
గ్రామాల అభివృద్ధితోపాటు, పేదలకు ఉపాధికల్పించేందుకు తీసుకొచ్చిన ఉపాధిహామీ పథకానికి వైసీపీప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. టీడీపీ ప్రభుత్వం ఉపాధిహామీ కింద కూలీలకు ఉపాధికల్పిస్తూనే, సదరు పథ కాన్ని సద్వినియోగంచేసుకొని, గ్రామాల్లో మరుగుదొడ్లు, శ్మశానాలు నిర్మించింది. సిమెంట్ రోడ్లు కూడా వేసింది. పొలాలకు అవసరమైన రోడ్ల నుకూడా శరవేగంగా పూర్తిచేసింది. ఉపాధిహామీచట్టం నిబంధనప్రకారం పనిచేసిన కూలీలకు 30రోజుల్లోపు వారికూలీడబ్బులు ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే 12శాతం వడ్డీసొమ్ముకలిసి, అసలుని చెల్లించాలి.
కానీ జగన్ ప్రభుత్వం మొండివైఖరితో వ్యవహరిస్తూ, టీడీపీప్రభుత్వంలో ఉపా ధి హామీపథకం కిందపనులుచేసిన కాంట్రాక్టర్లు, కూలీలకుడబ్బులివ్వ కుండా వారిని వేధిస్తోంది. న్యాయస్థానం కాంట్రాక్టర్లకు, కూలీలకు డబ్బు లు ఇవ్వాలని ఆదేశించినాకూడా వైసీపీప్రభుత్వంలో స్పందనలేదు. విచారణజరుగుతోందని, అందుకే ఉపాధినిధులను ఇవ్వలేకపోతున్నా మని ప్రభుత్వం కోర్టులకు తప్పుడు సమాచారమిస్తోంది. కేంద్రప్రభుత్వం నుంచి నిధులురాలేదని కూడా న్యాయస్థానాలను మోసగించింది. ఉపా ధిహమీ పథకం కింద 2020-21 ఆర్థికసంవత్సరానికి గాను, కేంద్ర ప్రభుత్వం రూ.21కోట్ల లేబర్ బడ్జెట్ ను రాష్ట్రానికి కేటాయించింది.
దేశం లోని అన్నిరాష్ట్రాలకు భిన్నంగా కేవలం మొదటి 5నెలల్లోనే 21కోట్ల పనిదినాలను పూర్తిచేసినట్లు జగన్ ప్రభుత్వం కేంద్రానికి చెప్పింది. ఏపీప్రభుత్వ సమాధానంపై కేంద్రం నోరెళ్లబెట్టింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలోనే 21కోట్ల పనిదినాలను ఎలాపూర్తిచేశారనే అనుమానం కేంద్రానికి వచ్చింది. దానిపై కేంద్రప్రభుత్వ అధికారులు నేడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో 13జిల్లాల్లో పని చేస్తున్న కేంద్రప్రభుత్వ అధికారులకు అసలు వాస్తవం కళ్లముందు కనపడుతోంది. రాష్ట్రంలో ఎక్కడా అసలు ఉపాధి పనులు చేయకుండా, కేవలం మస్టర్ల ఆధారంగానే ఏపీప్రభుత్వం కేంద్రమిచ్చిన ఉపాధి హామీ నిధులను బొక్కేసిందని అధికారులకు అసలు తత్వం బోధపడింది. వైసీ పీనేతలు, కార్యకర్తలు అడ్డగోలుగా వేలకోట్ల ఉపాధినిధులను కాజేశారు.
ఉపాధిహామీ నిధుల్లో భాగంగా, రూ.4,750కోట్లు ఖర్చుచేసినట్లు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదికఇచ్చింది. అందులో రూ.2వేలకోట్లవరకు అవినీతిజరిగిందని కేంద్రఅధికారులు గుర్తించారు. రూ.2వేలకోట్లను అధి కారపార్టీ నేతలు, కార్యకర్తలు దిగమింగడంవల్లే, నేటికీ చాలామంది ఉపాధిహామీ కూలీలకు నిధులుఅందలేదు. అవినీతిఆలోనలు చేసే, ఫ్యాక్షన్ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి నాయక త్వంలో అవినీతికికాదేదీ అనర్హమనే దాన్ని వైసీపీనేతలు, కార్యకర్తలు నిరూపించారు. అధికార పార్టీ నేతల అవినీతికారణంగా 75రోజులనుంచీ పేదలకు ఉపాధిహామీ సొమ్ము అందలేదు.
టీడీపీప్రభుత్వంలో ఉపాధిహామీ పనులుచేసిన వారికి కేంద్రంనుంచి నిధులురావడం ఆలస్యమైతే, రాష్ట్రప్రభుత్వ వాటా నిధులను కూలీలకు సకాలంలో చెల్లించడంజరిగింది. రైతులు ఆరుగాలం శ్రమించి పంటలుఅమ్మితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 6నెలలైనా వారికిడబ్బులుఇవ్వడంలేదు. రైతులకు, ఉపాధి హామీకూలీలకు డబ్బులివ్వకుండా వేధిస్తున్న ఈ ప్రభుత్వం, పేదల జీవితాలతో ఆడుకుంటోంది. ఉపాధిహామీ కూలీలవేతనాలు, వడ్డీతో సహా జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిందే. సోషల్ ఆడిట్ నివేదికలో రూ.684 కోట్ల అవినీతి వెలుగుచూసిందని, స్వయంగా రాష్ట్రప్రభుత్వ వెబ్ సైట్లోనే పొందుపరిచారు. ఆ మొత్తంలో రూ.146కోట్లనువెంటనే రికవరీ చేయాలనికూడా ప్రభుత్వం ఆదేశించింది.
రూ.684కోట్లలో, కేవలం రూ.146కోట్లు మాత్రమే రికవరీచేయాలని చెప్పిన ప్రభుత్వం, మిగిలిన సొమ్ముని ఎందుకు వదిలేసిందో సమాధానంచెప్పాలి. ఉపాధి హామీపథకం కింద జగనన్న కాలనీలను కూడా చదునుచేశారు. సదరు కాలనీల్లో అంతర్గతరోడ్లనిర్మాణానికికూడా ఈ ప్రభుత్వంఉపాధి హామీ నిధులనువాడింది. కేంద్రప్రభుత్వ నిబంధనలప్రకారం అలాంటి పనులకు ఉపాధిహామీ నిధులను ఉపయోగించకూడదు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు మెరకవేసుకోవడానికి, ఆక్రమించుకున్న భూములను చదును చేయడానికి, తాడేపల్లి ప్యాలెస్ లో మట్టి వేసుకోవడానికి, ఉపాధిహామీ నిధులను ఉపయోగించడం ముమ్మాటికీ నిబంధనలకు విరుద్ధమే. ఉపాధిహామీ పనుల్లో భాగంగా రూ.3,755కోట్ల విలువైన పనులకు అంచనాలు సిద్ధంచేసిన వైసీపీప్రభుత్వం, రూ.3,300కోట్లను మెటిరీ యల్ కాంపోనెంట్ గా చూపింది. 90శాతం మెటీరియల్ కాంపోనెంట్ కి పోతే, కేవలం పదిశాతం మాత్రమే లేబర్ కాంపోనెంట్ కు వాడారు.
రూ.3,693 కోట్ల రూపాయల విలువైన ఉపాధిహామీ పనులకు పరిపాలనా ఉత్తర్వులు జారీచేస్తే, వాటిలో రూ.3,575 కోట్లవిలువైన పనులు వివిధదశల్లోఉన్నాయని చెప్పారు. ఆ మొత్తంలో, ఖర్చు పెట్టిన దానికింద రూ.1117కోట్లను చూపారు. వాటిలో కేవలం రూ.98కోట్లను మాత్రమే లేబర్ కాంపోనెంట్ గా చూపారు. అంటే మెటీరియల్ కాంపోనెంట్ కింద దాదాపు రూ.1020కోట్లను వైసీపీనేతలు,కార్యకర్తలు స్వాహా చేశారు. ఉపాధిహామీ కూలీలకు దక్కాల్సిన సొమ్ముని యంత్రాల సాయంతో యథేచ్ఛగా దోపిడీచేశారు. పేదలకు ఇస్తున్నామనిచెప్పిన సెంటుపట్టా పేరుతో రూ.7వేలకోట్లు కాజేసిన జగన్ ప్రభుత్వం, సదరు భూములను చదునుచేసే పేరుతో రూ.1020కోట్లు కాజేసింది. వైసీపీ ప్రభుత్వం దిగమింగిన ఉపాధిహామీనిధులను, కేంద్రప్రభుత్వం జగన్ ప్రభుత్వంనుంచే ముక్కుపిండి వసూలుచేయాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE