తెలంగాణ వ్యతిరేక శక్తులతో రాష్ట్రంలో పాలన

-కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
అవినీతి ఆరోపణలతో ఈటల రాజేందర్ ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు యత్నించినా హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మలేదు. సీఎం కేసీఆర్ కు మాయ మాటలు చెబుతూ మసిపూసి మారేడు కాయ చేయడం వెన్నతో పెట్టిన విద్య. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు కోసం బీజేపీ శ్రేణులు చేసిన కృషి మరువలేనిది.
తెలంగాణ చరిత్రలో హుజూరాబాద్ ఎన్నిక కీలక మలుపు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ప్లీనరీ పెట్టాలనుకుంది. హుజూరాబాద్ ఎన్నికల కోసం పుట్టకొచ్చిందే ‘దళిత బంధు’ పథకం తప్ప దళితులపై ప్రేమతో కానేకాదు.
తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన పోవాలి….ప్రజా పాలన రావాలనే లక్ష్యంతో హుజూరాబాద్ లో ఎంతో మంది స్వచ్ఛందంగా ప్రచారం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో బండి సంజయ్ నాయకత్వానికి హుజూరాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. విజయ గర్జన కాదు…కల్వకుంట్ల గర్జన అని పేరు పెట్టుకుంటే బాగుండేది.
పార్లమెంట్ లో బీజేపీ నేత సుష్మాస్వరాజ్ మద్దతివ్వకుంటే కాంగ్రెస్ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేదా? తెలంగాణలో ముక్తకంఠంతో ప్రజలు పోరాడినందునే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందే తప్ప కేసీఆర్ కుటుంబంవల్ల కాద. తెలంగాణ వ్యతిరేక శక్తుల అడ్డగా మారిన తెలంగాణ భవన్. తెలంగాణ వ్యతిరేక శక్తులతో రాష్ట్రంలో పాలన జరుగుతోంది.
తెలంగాణ వాదులను బయటకు పంపిస్తున్న టీఆర్ఎస్ పార్టీ.నిజమైన తెలంగాణ ఉద్యమకారులు ఏ కుటుంబానికి దాసోహంగా ఉండరు. రాబోయే రోజుల్లో నిజమైన ఉద్యమకారులకు మనసా వాచా తెలంగాణ కోసం పార్లమెంట్ లో చిత్తశుద్దితో పోరాడిన పార్టీ బీజేపీయే నిజమైన వేదిక. కుటుంబ పాలనకు అతీతంగా నిజాయితీగా పాలన సాగించే పార్టీ బీజేపీ మాత్రమే.
తెలంగాణను అప్పులు రాష్ట్రంగా మార్చిన ఘనత బీజేపీదే. కేంద్రంపై విషం చల్లే ప్రయత్నం చేసిన పార్టీ టీఆర్ఎస్. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ప్రజలకు అంకితం. అద్భుతమైన తీర్పునిచ్చిన ఘనత హుజూరాబాద్ ప్రజలదే. ఎన్ని డబ్బులు కుమ్మరించినా…తెలంగాణ ప్రజలు డబ్బులకు లొంగరని మరోసారి నిరూపించారు. టీఆర్ఎస్ నియంత, అవినీతి, కుటుంబ పాలన హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఖూనీ చేశారనే విషయాన్ని బీజేపీ శ్రేణులన్నీ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని కోరుతున్నా.

Leave a Reply