ఈ జగన్ అనేవాడు 2024 తర్వాత వద్దంట్టే వద్దు.
మొదట పాఠాలు చెప్పమన్నాడు – ఎంత దుర్మార్గం?
ఆపైన నాడు నేడు అని పనులు సూపర్వైజ్ చేయమన్నాడు – ఎంత క్రూరత్వం?
ఆ తర్వాత స్కూల్ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూస్తూ ఉండమన్నాడు. ఎంత మూర్ఖత్వం?
ఇప్పుడు సమయానికి బడికి రమ్మంటున్నాడు. ఏంటి ఈ ఘోరం?
ఇలా అయితే, మా ఎల్ ఐ సి ఏజెన్సీ ఏమవుతుంది?
రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేస్తారు?
వడ్డీలకు ఇచ్చిన డబ్బులు ఎవరు వసూలు చేస్తారు?
కార్పొరేట్ స్కూళ్ళకు అడ్మిషన్స్ ఎవరు ప్రమోట్ చేస్తారు?
ఇలా చాలా పనులు ఉన్నాయి.
ఇన్నేళ్ళుగా కడుపులో చల్ల కదలకుండా ఇవన్నీ చేస్తూ, హాయిగా మా మానాన మేం నెలనెలా జీతాలు తీసుకుటూ, మా పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళలో చదివించుకుంటూ, అప్పుడప్పుడూ జీతాలు పెంచాలని పోరాటాలు చేస్తూ ఉంటే ఈ జగన్ వచ్చి మాకు ఇన్ని పనులు చెప్తాడా?
క్రమశిక్షణ అమలు చేయాల్సింది మేము.
అంతే కానీ మాకే క్రమశిక్షణా!?
అసలు బడికి రమ్మంటం ఎందీ?
పాఠాలు చెప్పమంటం ఏంది?
– సాదిక్