Suryaa.co.in

Devotional

సమ్మోహన వేణుగోపాల స్వామి దేవాలయం

గుంటూరు జిల్లా జూనంచుండూరు గ్రామంలో వెలసిన సమ్మోహన వేణుగోపాల స్వామి వారి దేవాలయం లో నల్లనిరూపుడైన స్వామి విగ్రహం సుమారు ఆరు అడుగులు పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో సుందర, సుమనోహరంగా దర్శమిస్తోంది.
క్రీస్తు పూర్వం అంటే దాదాపు 1500 సం వత్సరాల క్రితం ఈ పురాతన దేవాలయం నిర్మాణమైనట్లు పూర్వీకుల కథనం. దేవాల యంలోని ఈ స్వామిలో ఓ ప్రత్యేకత ఉంది.
స్వామి వారి మూలవిరాట్ ప్రణవ స్వరూపం లో (ఓంకారం) ఉండి ఆపై వేణుగోపాలునిగా స్వామిని శిల్పి మలిచారు. దేశంలో మరెక్కడా ఇటు వంటి భంగిమ ఉన్నటువంటి విగ్రహం ఉండన్నది పెద్దల కథనం. ఈ ఆదిప్రణవ స్వ రూపంలో చుట్టూ దశావతరాలు, సప్త్తరుషు లు, వేణుగోపాలునికి ఇరుప్రక్కల గోపికల మాదిరి రుక్మిణి, సత్యభామలు గోవులతో కొలువుదీరి ఉంటారు. చూసే వారికి ఈ విగ్రహంలో స్వామివారి పరమార్థం, ఆంతర్యం గోచరించక మానదు. శక్తి మొత్తం ఈ విగ్రహంలోనే వుందనటానికి ఈ ‘‘నిదర్శనాలు’’ కనిపిస్తున్నాయి.
బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్యు ల వంశచరిత్రలో స్వామివారిని వీరు దర్శించుకున్నట్లు తగిన ఆధారాలున్నా యి. కొండవీటి రెడ్డి రాజులైన కొమరిగిరి రెడ్డి (కర్పూర వసంత రాయలు) వారి సోద రులు పలుమార్లు స్వామి వారిని దర్శించిన ఆధారాలున్నాయి. వీరి ఆస్థాన నర్తకి ‘‘లకుమాదేవి’’ ఈ స్వామిని ఆరాధ్యదైవంగా కొలించిందట. నాడు గుంటూరు జమిందారులు ఆరోగ్య పరిస్థితులు సరిగాలేని సమయంలో స్వామివారిని దర్శించిన పిమ్మట వారి ఆరోగ్యం కుదుటపడటంతో వీరు స్వామివారి కి కొంత భూమిని దానం చేశారు. ఇప్పటీకీ ఆ భూమి దేవాలయం వారి ఆధీనంలో సాగుబడి జరుగుతోంది.
కొన్ని వేల సంవత్సరాలు గడిచినా నేటికీ స్వామివారి విగ్రహంలో ‘‘తేజస్సు’’ చెక్కు చెదరక పోవ డం విశేషంగా చెప్పుకోవచ్చు. అదే ఈ ప్రాంతవాసులను కాపాడుతుందన్నది వారి కి నిగూఢమైన విశ్వాసం. ఇప్పటికీ ఈ దేవాలయం నాలుగుసార్లు పునఃనిర్మాణం జరిగినట్లు పెద్దలు చెబుతున్నారు. వార్షికం గా స్వామివారి ‘‘తిరు కళ్యాణం’’ ఫాల్గుణ పౌర్ణమికి జరుగుతుంటాయి. వార్షిక పం డుగ ఉత్సవాలు నిర్విరామంగా నిర్వహిస్తు న్నారు. ప్రధానంగా స్వామి వారి గ్రామోత్స వాలలో గ్రామ యువకులు ప్రముఖ పాత్ర వహిస్తారు.

LEAVE A RESPONSE