Suryaa.co.in

Political News

బీసీలు బార్ల తాగాలే.. బర్రెలు కాయాలే.. గొర్రెలు కాయాలే

బీసీలు బార్ల తాగాలే..
బార్ల తాగాలే..
బర్లు(బర్రెలు) కాయాలే
గోసి పెట్టు కోవాలి గొర్లు(గొర్రెలు) కాయాలే
ఇది ప్రభుత్వ తీరు!
మంత్రి పదవుల లో ఎమ్మెల్యే సీట్లు , mlc సీట్ల కేటాయింపు లో పార్టీ పదవుల లో నామినేటెడ్ పదవుల లో ఉద్యోగుల ప్రమోషన్లలో పంగ నామాలు, సున్నం బొట్లు పెడుతుంది ప్రభుత్వం.
దేశం లోని వివిధ రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ లో అత్యంత దిగజారిన బీసీ ల ఆర్థిక రాజకీయ జీవనం. అట్టడుగున బీసీ కులాలు ఇంకో ఐదు సం” ఇట్లాగే గడిస్తే చాలా బీసీ కులాలు ముష్టి ఎత్తుకుని బ్రతకాలిసి వచ్చే ప్రమాదం రావొచ్చు.
కుల వృత్తులు కూలి పోతున్నాయి. సంపాదన లేక చదువు లేక రోగ మొస్తే వైద్యం లేక
విద్య, వైద్యం ఉచితంగా అందక వాటిని కొనుకునే ఆర్థిక స్తోమతా లేక విద్య వైద్యం కాసులున్నోడి పాద సేవలో తరించేలా చేసిన ప్రభుత్వం..
బీసీ లను చేపల వేటలో ఉంచి అగ్రకులాల ను మాత్రం పదవుల్లో పైసల లో ముంచి
సవితి తల్లి ప్రేమను ఒలక బోస్తోంది ప్రభుత్వం.
భూములను కాంట్రాక్టులను అగ్ర కులాలకు దోచి పెట్టీ బీసీల నోట్లో కొట్టుతుంది మట్టి.
అంబోతులకు అనుమానాలు ఉంటే లెక్కలు తీస్తే బయటకి వస్తుంది గుట్టు.
విద్యా సంస్థలు వైద్య సంస్థలు రియల్ ఎస్టేట్ సంస్థలు అనేక దోపిడీ సంస్థలు ఎవ్వరి
చేతిలో ఉన్నాయో తెలుస్తుంది. నీతిగా ఎదిగిన సంస్థలు ఎన్ని అవినీతి లో పెరిగిన సంస్థలు ఎన్ని?
2023 లో జరగబోవు ఎన్నికలలో ఇదే ప్రభుత్వానికి బీసీలు ఓటు వేస్తే తెలిసి తెలిసి అగాధంలో దూకినట్లే. తమ భవిషత్ ను తాము నరుక్కున్నట్టే.

– నారగోని ప్రవీణ్ కుమార్
సామాజిక కార్యకర్త

LEAVE A RESPONSE