Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర వ్యాప్తంగా సంవిధాన్ గౌరవ దివస్

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమ బృందం ప్రతినిధులతో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశమయ్యారు.సంవిధాన్ గౌరవ దివస్ కార్యాచరణ కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, అండమాన్ నికోబార్ రాష్ట్రాల ఇంచార్జ్ ఎన్ మహేష్ ముఖ్య అతిథి గా హాజరయ్యారు.

సంవిధాన్ కార్యక్రమం క్షేత్ర స్థాయిలోకి తీసుకుని వెళ్ళేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో కార్యక్రమం రూప కల్పన చేశారు. పలు ప్రాంతాల్లో దళిత యువకులు తో సహపంక్తి భోజనాలు, పోలింగ్ బూత్ స్థాయి లో సంవిధాన్ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ కార్యక్రమం ఏర్పాటు ఎలా ఉండాలి అనే విషయాలను వివరించారు. సమావేశంలో సంవిధాన్ కార్యక్రమం రాష్ట్ర ఇంఛార్జి లు గుడిసె దేవానంద్,శరణాల మాలతీ రాణి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE