– కేటీఆర్ కృషి వల్లే తెలంగాణకి ఈ కార్ రేస్
– ఏసీబీ, ఈడీ అయితే ఈ రాష్ట్రంలో మంత్రులే విచారణ చేస్తున్నట్లు కనిపిస్తోంది
– కొన్ని ఛానళ్ల వాళ్ళు వారే ప్రాసిక్యూషన్ చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నాయి
– మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ,జి .దేవి ప్రసాద్ ,తుల ఉమ
హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వం కేటీఆర్ ని కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ కేటీఆర్ ఒకే లైన్ తోనే ఉన్నారు. మొదటి రోజు ఏం మాట్లాడినారో ఇవాళ అదే మాట మాట్లాడుతున్నారు. ఈ దేశంలోనే తెలంగాణ నెంబర్వన్ గా ఉండాలి. ప్రపంచ స్థాయిలో ఈ కార్ రేస్ ఉన్నటువంటి అనేక దేశాలు పోటీ పడ్డాయి . కేటీఆర్ కృషి వల్లే తెలంగాణకి ఈ కార్ రేస్ వచ్చిన విషయం ప్రపంచానికి తెలుసు.
ఈ కార్ రేస్ ని కొనసాగించకుండా కేవలం కేసులు పెట్టాలి అనే కుట్రలో భాగంగానే ఈడి కేసులు. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ ఈడి ఎంటర్ అయినటువంటి సందర్భంలో విచారణ చేయాల్సింది ఏసీబీ, ఈడీ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులే విచారణ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ కొన్ని కొన్ని ఛానళ్ల వాళ్ళు వారే ప్రాసిక్యూషన్ చేస్తున్నట్టుగా విచారణలో భాగమైనట్టుగా వ్యవహరిస్తున్నాయి.సమాజాన్ని పక్కదారి పట్టించే కుట్ర కు తెరలేపుతున్నాయి.
నిజానికి ఈ డి విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా కాన్ఫిడెన్షియల్ గా కొంతమంది అధికారుల మధ్యలో జరిగేటువంటి ఆ విచారణ వీరికి తెలిసినట్టుగా ప్రొద్దున నుంచి ఒక గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రజల్ని గందరగోళ పరిచే పద్ధతిలో ఇలా చేయడం చాలా దురదృష్టం. అది వాంఛనీయం కాదు అనే మాట చెప్పదలుచుకున్నాము.
మా నేత నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి కేసులకైనా భయపడకుండా ధైర్యంగా మొన్న తొమ్మిదో తారీఖు నాడు ఏసీబీ కేసు విచారణను ఎదుర్కొన్నాడు. ఇవాళ ఈడీ కేసు విచారణకు అవుతున్న సందర్భంలో, కేటీ ఆర్ వెంట కొందరు నాయకులు వస్తే వారి మీద కేసులు పెట్టడం ,అదుపులోకి తీసుకోవడం దుర్మార్గం. కొంతమంది నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ల కు తరలించారు. మా నేతల పై కారణంగా పెట్టిన కేసులు ఉపసంహరించుకుని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి.