Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో ప్రమాదంలో సనాతన ధర్మం

– తెదేపా ఈ విషయంలో మౌనంగా ఉంది
– ఇసుక మాఫియా చెలరేగిపోతోంది
– బిజెపి జాతీయ కార్యదర్శి సునీల్
– ఇగోయిజం, శాడిజం, ఫ్యాక్షనిజం కలగలిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి
– రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది
– జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ

భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరులోని మాజేటి కళ్యాణమండపం నందు జరిగింది ముఖ్య అతిథులుగా జాతీయ కార్యదర్శి రాష్ట్ర సహా ఇంచార్జ్ సునీల్ దేవధర్ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ విచ్చేశారు.

బిజెపి జాతీయ కార్యదర్శి రాష్ట్ర సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ మాట్లాడుతూ…
వైసీపీ పాలనలో హిందూ ఆలయాలపై, సంప్రదాయాలపై దాడులు పెరిగాయి. జిన్నా టవర్ పేరు మార్పు విషయంలో తెదేపా ఎందుకు మౌనంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సనాతన ధర్మం ప్రమాదంలో పడింది. అధికార వైకాపా వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా ఈ విషయంలో మౌనంగా ఉంది. హిందూ ధర్మాన్ని రక్షించుకునేందుకు బిజెపి కట్టుబడి ఉంది.

రాష్ట్రంలో నిరుద్యోగ యువత సంఖ్య పెరిగిపోతుంది. ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. పెట్రో ధరలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించటంలేదు? రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నింటికి నిధులు కేంద్రం నుంచి వచ్చేవే. కేంద్ర పథకాలకు వైసీపీ స్టిక్కర్ వేసి పంపిణి చేస్తున్నారు యుపి తరహాలో డబుల్ ఇంజిన్
bjym1 ప్రభుత్వం వస్తేనే ఏపీ బాగుపడుతుంది. బీజేపీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే ఏపీ స్వర్ణాంధ్రగా మారుతుంది. శ్రీలంక కి, ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తుత ఆర్ధిక పరిస్ధితిలో తేడా లేదని, తిరిగి చెల్లించే పరిస్ధితి ఆంధ్రప్రదేశ్ కు లేనందున ఎక్కడా అప్పు పుట్టటం లేదని అన్నారు. జగన్మోహనరెడ్డి ఆంధ్రభవిష్యత్తు మోత్తాన్ని నాశనం చేశాడన్న ఆయన, బిజెపి యువమోర్చా ఆంధ్ర భవిష్యత్తు పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

వైసీపీ నేతలు రాష్ట్రం వారి సొంత సోత్తులా ప్రవర్తిస్తున్నారని, టిడిపి, వైసిపి ల దృష్టిలో ముస్లింలు కేవలం ఓటు బ్యాంకు మాత్రమేనని ఆయన విమర్శించారు. జగన్మోహనరెడ్డి ఆలోచనవల్ల రాష్ట్రంలో హిందూ సనాతన ధర్మమే ప్రమాదంలో పడింది. టిడిపి హయాంలో చంద్రన్న పేరుతో ఉన్న కేంద్రం అందిస్తున్న పధకాలకు ఇప్పుడు జగనన్న పేరు పెట్టి ప్రజలను మాయ చేస్తున్నారు అని విమర్శించారు.

జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. వైసీపీ వ్యాపార సంస్థల్లో పనిచేసే వ్యక్తులకు ప్రభుత్వంలో ఉద్యోగాలిచ్చారు. 2024లో మళ్లీ ముఖ్యమంత్రి కావటం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు
bjym2 నడుపుతున్నారు. ప్రజలపై మోయలేని పన్నుల భారం మోపి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. నరేంద్ర మోదీ 130 సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జగన్ వాటిని నవరత్నాలుగా మార్చి అమలు చేస్తున్నారు. ఇగోయిజం, శాడిజం, ఫ్యాక్షనిజం కలగలిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తప్ప ఎవరూ వ్యాపారాలు చేసేందుకు వీల్లేదు. ఇసుక, గనులు, మద్యం వ్యాపారాలతో సంపదను ఏకీకృతంగా దోచుకుంటున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైసీపీ గుండాలు దాడులు చేస్తున్నారు అని విమర్శించారు.

బిజెపి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్ మాట్లాడుతూ… భారతీయ జనతా యువమోర్చా ఈరోజు ఏపీలో యువతకు సపోర్ట్ గా నిలబడింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత నిరుద్యోగులను టిడిపి వైసిపి దగా చేశాయి. బాబు వస్తే జాబు వస్తుంది అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను నడ్డి విరిచారు. అనేక ఆశలతో నిరుద్యోగులు జగన్ కు మద్దతు ఇస్తే మాట తప్పను మడమ తిప్పను అంటూ అనేక వరాలు ఇచ్చాడు.

ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని 2 లక్షల 50 వేల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీపీఎస్సీ ద్వారా ఒక్క జాబ్ కూడా జగన్మోహన్ రెడ్డి నేటికీ భర్తీ చేయలేదు. దీన్ని యువమోర్చా ఖండిస్తుంది. వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల ఉద్యోగాల పరిస్థితి
bjym3 అయోమయంగా ఉంది. పార్టీ కార్యకర్తలకు వాలంటీర్లుగా ఇచ్చారు. సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అనేక రకాల స్కిల్ టెస్ట్ లు పెడుతూ ఒక్కొక్కరికి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. పర్మినెంట్ కోసం లక్షా ఇరవై వేల మంది సచివాలయ ఉద్యోగులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. రెండేళ్ల తర్వాత 10,500 ఉద్యోగులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. పది నెలలు అయినా ఒక పోస్ట్ కూడా భర్తీ చేయలేదు నోటిఫికేషన్ ఇవ్వలేదు నిరుద్యోగుల పక్షాన మంత్రుల ఇళ్లను ముట్టడించాం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించాం. రాబోయే రోజులలో ప్రభుత్వ మెడలు వంచేలా ప్రజా పోరాటం చేస్తాం. నిరుద్యోగుల పక్షాన ఉద్యమిస్తాం.

యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ, ఉప్పిలి వంశీయాదవ్, బైరెడ్డి శబరి,మిట్టా వంశీకృష్ణ,బండిbjym4 ఆనంద్, రాజేష్,సాయి దేవానంద్, వంశి,రవీంద్ర,రవీందర్ రెడ్డి యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మైలా హరికృష్ణ,నవనీత్ రెడ్డి,హరి పావని,పోకూరి నాగిరెడ్డి,నన్నపనేని హరీష్,తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE