Suryaa.co.in

Features

ఉక్కు సంకల్పం

జవేరిభాయ్ లాడ్ బాయి
దంపతుల కనులపంట..
నాడియార్ లో నడియాడిన
పౌరుషమే పటేలంట..!
బారిష్టర్ పట్టా పొందిన
ప్రతిభావంతుడు వల్లభాయి..
బార్దోలి సత్యాగ్రహాన్ని
నడిపిన సమర్ధుడోయి..!
బ్రిటిష్ పన్నుల నిరసించి
నిలిచిన ధీరుడే పటేలు..
కిసాన్ ఉద్యమ ఘనతకు
ఇచ్చిన బిరుదే సర్దారు..!
స్వదేశీ సంస్థానాల
విలీన కారకుడు..
అఖండ భారత ఆత్మకు
అసలైన దార్శనికుడు..!
వింధ్య సత్పూరల సాక్షిగా
వెలసిన సంకల్పం..
నర్మదా నదీ తీరం
ఐక్యతా ప్రతిమకు రూపం..!
ఉక్కుమనిషిగా కీర్తి గడించిన
ఉజ్వల చరితం..
తల్లి భారతికి సేవ చేసిన
మన భారత రత్నం..!
కోటి గొంతుకల నినాదం
నేటి తరాలకు నమూనం..
భారత భాగ్య విధాత
బంగారు కలల నేత..!

రామకృష్ణ మనిమద్దె
9494353828

LEAVE A RESPONSE