– సాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అధ్యక్షతన ఈరోజు సాట్స్ చేపడుతున్న వివిధ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఎల్‌బి స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి క్రీడలు యువజన అభివృద్ధి పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి మరియు వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ సుల్తానియా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో క్రీడా ప్రాధికార సంస్థ పరిధిలో ఉన్న స్టేడియాలు వాటి నిర్వహణ, జిల్లా యువజన అభివృద్ధి మరియు క్రీడా సంక్షేమ అధికారుల పని తీరు, జిల్లాల్లో చేపట్టాల్సిన క్రీడాభివృద్ధి కార్యక్రమాలు, స్పోర్ట్స్ స్కూళ్లు, అకాడమీలలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాల గురించి ఈ సమీక్ష సమావేశంలో చర్చించారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మార్గదర్శకత్వంలో క్రీడారంగా సంక్షేమానికి సాట్స్ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. వచ్చే వేసవికాలంలో నిర్వహించాల్సిన క్రీడా శిక్షణ శిబిరాలు, క్రీడా శిక్షకులు, క్రీడాకారులకు కావలసిన వివిధ సదుపాయాల ఏర్పాటుపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు, సుజాత, శ్రీమతి ధనలక్ష్మి, అనురాధ, చంద్రారెడ్డి, స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు, జి .రవీందర్, సుధాకర్ రావు, వెంకటేశ్వరరావు, గోకుల్, రవి, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు