Suryaa.co.in

National Telangana

జార్ఖండ్ లో గెలుపు ఇండియా కూటమి సమిష్టి విజయం

– బిజెపి తలకిందులు గా తపస్సు చేసిన ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు
– జార్ఖండ్ ప్రజలు మమ్ములను విశ్వసించారు.. పట్టం కట్టారు
– రాంచీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్: జార్ఖండ్ రాష్ట్రంలో తాజా ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు… మా అందరి సమిష్టి విజయం. ఇక్కడ బిజెపి తలకిందులుగా తపస్సు చేసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. వారి కొనుగోలు జిమ్మిక్కులు ఇక్కడ సాగవు. మా ఎమ్మెల్యేలు పార్టీ పట్ల, భావజాలం పట్ల కమిట్మెంట్తో ఉన్నవారు.

జార్ఖండ్ మైన్స్, మినరల్స్ ఈ రాష్ట్ర ప్రజలకే చెందాలి అట్లా కాకుండా ఆదాని, అంబానీ వంటి క్రోనీ క్యాపిట లిస్టులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దని మేము ప్రజలకు విజ్ఞప్తి చేశాం.

మా నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారు. సంవిధాన్ సమ్మేళన్ భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ దాని ద్వారా వచ్చిన హక్కులను కాపాడుతామని భరోసా ఇచ్చారు.

జనాభా నిష్పత్తి ప్రకారం సంపద, ఆస్తులు సమానంగా పంచబడాలని మన భారత రాజ్యాంగం చెబుతుంది.. అని మా పార్టీ నాయకత్వం వివరంగా ప్రజలకు చెప్పింది.

జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ కూటమి గత ఐదు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనులు… మరోసారి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో బడ్జెట్ అంకెలు, సంఖ్యలతో వివరంగా చెప్పాము మా కూటమి నేతల మాటలను ప్రజలు విశ్వసించారు. బిజెపి పట్ల మాకు భ్రమలు లేవు అని ఈ ప్రాంత ప్రజలు నమ్మి ఇండియా కూటమికి భారీ మెజారిటీని ఇచ్చారు.

రాహుల్ గాంధీ, సోరేన్ వంటి యువ నాయకులు, ఖర్గేలాంటి అనుభవం కలిగిన వ్యక్తుల సారథ్యంలోని ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలు ఉంటే మంచిది. వీరిని కాకుండా క్రోని క్యాపిటల్స్, బహుళ జాతి సంస్థలకు ఈ రాష్ట్ర సంపాదన కట్ట బె ట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని వివరించాము. ఈ విషయాలను జార్ఖండ్ ప్రజలు విశ్వసించారు.

ఇండియా కూటమి గెలిస్తే బంగ్లాదేశ్ నుంచి వలసలు వెల్లువెత్తుతాయి, చొరబాటుదారులు పెరుగుతారని బిజెపి తప్పుడు ప్రచారం చేసింది. చొరబాటు దారులను నియంత్రించాల్సింది సరిహద్దుల్లోని బిఎస్ఎఫ్, ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వం లోని బిజెపి చేతిలో ఉంది.. వారి వైఫల్యం మూలంగానే చొరబాటు దారులు పెరుగుతున్నారు. వారి వైఫల్యాన్ని ఇతరుల వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మేము జార్ఖండ్ ప్రజలకు వివరించాం. ఇక్కడి ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళ మాటలు నమ్మలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాదు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి పెడతాం.

LEAVE A RESPONSE