మళ్ళిమళ్ళి పాడాలి
ఈ పాట..
ఇదే పాట..ప్రతి చోట..
ఇలాగే పాడుకుంటాను..
స్వరకల్పన సత్యం..
ప్రతి పాట ఓ ఆణిముత్యం..
సరళమైన వాయిద్యాలు..
అందుకే పాటలన్నీ హృద్యాలు..
వింటుంటే పులకించు హృదయాలు..!
ఎక్కడి నుంచి
లాగేస్తాడో ట్యూను..
నీకే తెలుస్తుంది పోనుపోను
నవ్వవే నా చెలీ..
చల్లగాలి పిలిచేను..
మల్లెపూలు నవ్వేను..
వలపులు పొంగే వేళలో..
ఎక్కడో విన్నట్టుండే బాణీ..
గాతా రహే మెరా దిల్..
ఆ…దేవానంద్
గైడ్ సినిమాలో..
బర్మన్ స్వరరచన…
ఎవరూ పోల్చలేని అనుకరణ!
సత్యం మ్యూజిక్కులో
ఇలాంటి మ్యాజిక్కులెన్నో
ఇది తీయని వెన్నెల రేయి..
మది వెన్నెల కన్నా హాయి..
ఇది మరీ చిత్..చోర్…
జబ్ దీప్ జలే ఆనా..
జబ్ షామ్ ఘలే ఆనా..
శ్రావ్యంగా ఉండే పాటలను
నవ్యంగా మలచే
తబలా సామ్రాట్టు…
ఏ దివిలో విరిసిన పారిజాతమో..
ఏ కవిలో వెలసిన ప్రేమగీతమో మరీ హిట్టు!
ఎన్టీఆర్ తో స్నేహమేరా జీవితం అంటూ
ఎదురీతకు అంతము లేదా..
అనుకుంటూ మామ..చక్రవర్తి
వంటి దిగ్గజాల నడుమ
పెద్ద సినిమాలు చేసి..
పెంచాడు పాటల వాసి..!
సూపర్ స్టార్ కృష్ణతో కౌబాయ్ సినిమాలు..
ఆంధ్రా దిలీప్ చలంతో
మట్టిలో మాణిక్యాలు..
విజయనగరం జిల్లా కొమరాడ నుంచి
ఆదినారాయణ రావు సాయంతో
మదరాసు చేరిన బాసు..
రిమ్ జిమ్ రిమ్ జిమ్
హైదరబాద్..
సత్యం జిందాబాద్!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286