దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలోనే అమలవుతున్నాయి

-ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలి
-ముఖ్యమంత్రి సహాయ నిధి, కల్యాణలక్ష్మి, షాధీ ముభారక్ చెక్కుల -పంపిణీ చేసిన మంత్రి గంగుల కమలాకర్

దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలోనే అమలవుతున్నాయనీ, ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ లోని మంత్రి మీ సేవ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో లబ్ధి దారులకు కల్యాణలక్ష్మి, షాధీ ముభారక్ చెక్కుల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ…గతంలో పాలకులు ఏ రోజు కూడా తెలంగాణ పేదల సంక్షేమం కోసం ఆలోచన చేయలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాతే సీఎం కేసీఆర్ పేదల బతుకులు మార్చాలన్న ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారనీ అన్నారు. మరోసారి రాష్ట్ర ప్రజల్ని మభ్య పెట్టేందుకు ఆంధ్ర నాయకులు వస్తున్నారని వారి మాటలు నమ్మద్దని, ఒక్కసారి నమ్మితే భవిష్యత్ తరాలు నష్టపోవాల్సి వస్తుందన్నారు. భవిష్యత్తు తరాల బాగుకోసం ఆడిబిడ్డలందరూ కేసీఆర్ ను ఆశీర్వదించాలని ఆయనకు అండగా నిలవాలని కోరారు.

తెలంగాణ రాకముందు రైతులు సాగునీటి కోసం ఎరువుల కోసం కరెంటు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. రైతుబంధు కింద ఆర్థిక సాయం అందించడంతో పాటు ఎరువులను సకాలంలో అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. అందరి సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వారీగా అన్ని కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రజల బడుగుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ను ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవెని మధు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, బీ ఆర్ ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్, కార్పొరేటర్లు గంట కల్యాణి,కుర్ర తిరుపతి గందే మాధవి, అయిలెందర్ యాదవ్, అర్ష కిరణ్మయి,ఆర్ష మల్లేశం,నాంపల్లి శ్రీనివాస్, గందె మహేష్, వాసాల రమేష్, మెచినేని అశోక్,కోల సంపత్, గంట శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply