– పోలీసుల అదుపులో ఎర్రగుంట్ల వాసి రియాజ్
ధర్మవరం: శ్రీసత్య సాయి(డి) ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ పై స్థానిక 1-టౌన్ పోలీస్ స్టేషన్ లో దేశద్రోహం కేసు నమోదైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని శనివారం ఉదయం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 29 ఉగ్రసంస్థలతో మహమ్మద్ కు సంబంధాలు ఉన్నట్టు విచారణలో గుర్తించారు. అటు ధర్మవరం 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగుంట్ల వాసి రియాజ్ ‘No India I love Pakistan’ అని వాట్సాప్ స్టేటస్ పెట్టగా అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.