జనసేనకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి వైసీపీకి భయం పట్టుకుంది

* సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను పార్టీకి డిపాజిట్లు గల్లంతే
* పాలనకు పనికిరాని పులివెందుల పులిని జూలో పెట్టండి
* పోలీసులు లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలకు గడప గడపకు వెళ్లే పరిస్థితి లేదు
* కాకినాడ మీడియా సమావేశంలో పీఏసీ సభ్యులు పంతం నానాజీ

పర్చూరు సభ సక్సెస్ అవ్వడంతో వైసీపీ నాయకులు ప్యాంట్లు తడుపుకున్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పంతం నానాజీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ చేస్తుంటే చూస్తూ ఓర్వలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ డిపాజిట్లు గల్లంతు అవుతాయోనన్న భయంతో నోటికి వచ్చినట్లు పేలుతున్నారని అన్నారు. ఒక ప్రభుత్వంపై రెండో ఏడాదిలోనే ఇంతటి వ్యతిరేకత రావడం నేను ఎప్పుడు చూడలేదని, సార్వత్రిక ఎన్నికలు దేవుడెరుగు… కనీసం పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్ ఎన్నికలైనా పెట్టగలిగే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. సోమవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ “ పవన్ కళ్యాణ్ కి వస్తున్న ప్రజాదరణ చూసి కొంతమంది వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారు. అందుకే కుక్కల్లా మొరుగుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని గతంలోనే తమను తాము కుక్కులతో పోల్చుకున్నారు కనుక నేను కుక్కలు అనే పదాన్ని ఉపయోగించాను.

మీ పులిని జూలో పెట్టండి
వైసీపీ నాయకులు కొందరు ముఖ్యమంత్రిని పులివెందుల పులి అంటున్నారు. ఇంతమంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడి, వారి కుటుంబాలు రోడ్డున మీద పడితే మీ పులి ఏం చేస్తోంది. ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది కష్టాలు తీరుస్తారని తప్ప… పులులు, సింహాలు, కుక్కలు పాలించడానికి కాదు. మీ వాడు నిజంగా పులి అయితే విశాఖపట్నం జూపార్క్ లో వదిలేయండి. మేము మనుషుల పాలనలో ఉండాలనుకుంటున్నామ్… జంతువుల పాలనలో కాదు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తతోనే ఈ రోజు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. కోనసీమలో 12 మండలాల్లో దాదాపు 50వేల ఎకరాల్లో ఈ రోజు క్రాప్ హాలిడే ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాలకు వెళ్లాలంటే రైతులు భయపడే పరిస్థితులు తీసుకొచ్చారు. పోలీసుల సహకారం లేకుండా ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లలేకపోతున్నారు. మహిళలు ఎక్కడ తిరగబడతా రో అన్న భయంతో బిక్కు బిక్కుమనుకుంటూ కార్యక్రమాన్ని కానిచ్చేస్తున్నారు.

*చేతకాదని ఒప్పుకోండి మేము తీసుకొస్తాం
మంత్రి జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. జూపూడి ప్రభాకర్… శెట్టి బలిజ యువతను అకారణంగా నిందించినప్పుడు జోగి, వేణు, బోస్ నిద్రపోయారా? మీరు అనాడు ఎందుకు ఆయన మాటలను ఖండించలేదు. మీరంతా బీసీ ద్రోహులు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్న ప్రతి ఒక్కరు సీబీఐ దత్తపుత్రులే. బీజేపీ నుంచి పైసా తెచ్చారా అని కొంతమంది వైసీపీ నాయకులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు… మాపై ఉన్న కేసులకు భయపడి మేము రూపాయి కూడా తీసుకురాలేకపోతున్నామని పత్రిక ముఖంగా ముఖ్యమంత్రి తెలియజేస్తే .. మా నాయకుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తాడు.
అంబటి రాంబాబు ది మంత్రి పదవి వచ్చే వరకు ఒక బాధ… పదవి వచ్చాక ఇంకో బాధ. అంబటి గారు సజ్జలను బ్రతిమిలాడుకోండి మీ శాఖకు సంబంధించిన పనులు అప్పగించమని. మీరు దయచేసి పోలవరంపై దృష్టి పెట్టండి. ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా దించేస్తే ఆంధ్రప్రదేశ్ కి అంత మంచిదని ప్రజలు ఎదురుచూస్తున్నార”ని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కరెడ్ల గోవింద్, బండారు మురళి , ముసలయ్య, ముద్రగడ రమేష్ , బుజ్జి, ప్రసాద్, సంతోష్ , సునీల్ తదితరులు పాల్గొన్నారు.