Suryaa.co.in

Telangana

సెహభాష్ పోలీస్!

– తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్

హైదరాబాద్: తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశంలోనే నెంబర్‌వన్ అనిపించుకోవడం అందరికీ గర్వకారణమని సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆ మేరకు తెలంగాణ పోలీసులను అభినందిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

తెలంగాణ పోలీసులారా.. మీ కర్తవ్య దీక్షతో తెలంగాణ కీర్తి పతాకను
రెపరెపలాడించినందుకు యావత్ రాష్ట్ర ప్రజల తరుపున మీకు ధన్యవాదాలు, అభినందనలు.

తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్ వన్ అనిపించుకోవడం ప్రతి తెలంగాణ పౌరుడికి గర్వకారణం. శాంతిభద్రతల పరిరక్షణలో భవిష్యత్‌లోనూ ఇదే అంకితభావాన్ని కొనసాగించండి. మీ భవిష్యత్ సంక్షేమాన్ని మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది.

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌తో సరికొత్త పోలీస్ సంక్షేమానికి శ్రీకారం చుట్టాం. వృత్తిలో మీరు చూపిన నిబద్ధత లాగే మీ సంక్షేమం పట్ల అంతే నిబద్ధతతో ముందుకెళ్తామని మాటిస్తున్నాన ని ట్వీట్ చేశారు.

LEAVE A RESPONSE