– ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్ దే
– ఎమ్మెల్సీ కవిత నివాసానికి విచ్చేసిన సంత్ శ్రీ చంద్రశేఖర్ మహారాజ్
– శ్రీ చంద్రశేఖర్ మహారాజ్ ను సన్మానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత*
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కృషితోనే తెలంగాణలో బంజారాల బతుకులు మారాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అఖిల భారత బంజారాల ఆధ్యాత్మిక గురువు, పౌరాదేవీ పీఠాధిపతి శ్రీశ్రీ చంద్రశేఖర్ మహారాజ్ బుధవారం నాడు ఎమ్మెల్సీ కవిత నివాసానికి విచ్చేశారు. వారికి సంప్రదాయబద్దకంగా ఎమ్మెల్సీ కవిత ఆహ్వానం పలికారు. వారిని సన్మానించి ఆశ్వీర్వాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… రాష్ట్రంలోని బంజారాల ఆశిస్సులు కేసీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీ పై ఉన్నాయని తెలిపారు. బంజారాల అభివృద్ధికి సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. బంజారా బిడ్డల పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకున్నారని వివరించారు.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్నా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించి కేసీఆర్ చరిత్ర సృష్టించారని స్పష్టం చేశారు. బంజారాలకు ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించామని, 3 వేలకుపై తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ,మాజీ ఎంపీ కవిత,మాజీ ఎమ్మెల్యే చంద్రవతి, హరిప్రియ నాయక్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు,వాల్య నాయక్, రాంబల్ నాయక్, రామచంద్ర నాయక్, రూప్ సింగ్, పలువురు బంజారా మత పెద్దలు పాల్గొన్నారు.