– కృష్ణా జలాలను సమర్థవంతంగా వాడుకోలేని చేతగాని ప్రభుత్వం
– కృష్ణా జలాలను చంద్రబాబు వాడుకుంటున్నా మంత్రులెవ్వరు ఒక్క మాట మాట్లాడడం లేదు
– బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు దేవరకొండ లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యేజగదీష్ రెడ్డి
దేవరకొండ: కృష్ణా జలాలను సమర్థవంతంగా వాడుకోలేని , చేతగాని ప్రభుత్వం ఇది. కృష్ణా జలాలను చంద్రబాబు వాడుకుంటున్నా జిల్లా మంత్రులెవ్వరు ఒక్క మాట మాట్లాడడం లేదు. మన తెలంగాణ చంద్రబాబు చేతుల్లోకి పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు.వాళ్ళు తన్నుకొని నవ్వులపాలు అవుతున్నారు.
బంగారు తెలంగాణ కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు పెట్టింది కేసీఆర్. కేసీఆర్ పెట్టిన పథకాలు ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకులకు ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.కాంగ్రెస్ అంటేనే మోసగాళ్ల పార్టీ, డిల్లీ గులాముల పార్టీ. కేవలం కమీషన్లు వచ్చే పనులే చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
ప్రజల తిరుగుబాటు మొదలైంది. ప్రజల ఆగ్రహం ముందు కాంగ్రెస్ తెలంగాణ నుండి పారిపోతది స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేని చేతగాని ప్రభుత్వం ఇది. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే బిఆర్ ఎస్ కు ప్రజల బ్రహ్మరథం పడతారు. అన్ని స్థానాలు బిఆర్ ఎస్ వే. రాబోయే రోజులన్నీ బి ఆర్ ఎస్ వే.