Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి కుటుంబంలో కుటీర పరిశ్రమల ద్వారా స్వయం ఉపాధి

– విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్

విజయవాడ: డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో గ్రామాల్లోని ప్రతి కుటుంబంలో కుటీర పరిశ్రమల ద్వారా స్వయం ఉపాధి సాధించవచ్చు అని తద్వారా కుటుంబాల ఆర్థిక స్థితి పెంచుకోవచ్చని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) అన్నారు. శుక్రవారం విజయవాడ పార్లమెంటు సభ్యుని కార్యాలయంలో జరిగిన జిల్లాలోని అన్ని మండల డ్వాక్రా సంఘాల సమైక్యల అధ్యక్షులు సమావేశంలో కేశినేని శివనాథ్ చిన్ని పాల్గొని వారితో మాట్లాడారు.

ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు ఆదేశానుసారం ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త తయారు కావాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని. దాన్ని సాధించడానికి జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు పంచాయతీరాజ్ ద్వారా అనేక కుటీర పరిశ్రమలు పై ఉపాధి అవకాశాలు అవగాహన కార్యక్రమాలు పెంపొందించడానికి రెండవసారి హైదరాబాదులో ఉన్న జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ కు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని మండలాల్లోని డ్వాక్రా సంఘాల సమైక్య అధ్యక్షులను పంపిస్తున్నామని అన్నారు.

వీరు అక్కడ ఎన్ ఐ ఆర్ డి నిర్వహిస్తున్న కుటీర పరిశ్రమలను అవగాహన చేసుకుని వారి మండలాల్లోని ఆ కుటీర పరిశ్రమలు వేటికి అణువుగా ఉన్నాయో అధ్యయనం చేసి వాటిని అమలు చేయాలని తద్వారా ప్రతి కుటుంబంలో వ్యాపారవేత్తలను తయారు చేయాలని కోరినారు. ఈ రకంగా జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దానికి కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న అనేక పథకాలను ఈ జిల్లాలో అమలు చేయడానికి తను కృషి చేస్తానని అన్నారు.

ఈ అవకాశాన్ని జిల్లాలోని డ్వాక్రా సంఘాల్లోని సభ్యులందరూ మరియు నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తో పాటు అధికారులు. అన్ని మండలాల సమైక్యల అధ్యక్షులు మరియు జిల్లా సమైక్య అధ్యక్షురాలు కందుల కల్పన, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు జీవీ నరసింహారావు. సొంగ సంజయ్ వర్మ మరియు తెలుగు మహిళా అధ్యక్షురాలు కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి . తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE