సీనియర్ జర్నలిస్ట్ అవయవ దానం

Spread the love

కరప:సీనియర్ జర్నలిస్ట్ ,కరప గ్రామానికి చెందిన డి హెచ్ వి సాంబశివరావు అవయవదానం చేస్తూ ధ్రువీకరణ పత్రాన్ని ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణకు అందజేశారు. సోమవారం సాంబశివరావు తండ్రి వీరభద్రరావు దశదినకర్మలు పూర్తిగావడాన్ని పురస్కరించుకుని తన అవయవదానానికి అంగీకరిస్తూ ఫారాన్ని అందజేశారు.

తమ తండ్రి అంత్యక్రియలు సందర్భంగా ఎందరో కష్టపడ్డారని, అలాంటి కష్టం మరొకరికి రాకూడదని, అదేవిధంగా తన శరీర అవయవాలు ఇతరులకు ఉపయోగపడాలి అన్న భావనతో అవయవ దానానికి అంగీకరిస్తూ కాకినాడ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పాఠంశెట్టి నారాయణమూర్తి సమక్షంలో ఈ ఫారాన్ని అందజేశారు.

ఇప్పటికే సాంబశివరావు సోదరుడు టీవీ5 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దేవగుప్తాపు మూర్తి తన మరణానంతరం తన మృతదేహాన్ని హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి అందజేసేందుకు ధృవీకరణ పత్రం ఇచ్చారు. వారిరువుని అధికారులు, అనధికారులు ప్రశంసించారు.

Leave a Reply